సాక్షి లైఫ్ : మితిమీరిన రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకంతో దెబ్బతింటున్న మానవ, జంతు, పంటల ఆరోగ్యాన్ని గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక 'మిషన్ సేహత్'కు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) అనుబంధ సంస్థలు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) పరిధిలోని 113 సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. ఆహార ఉత్పత్తి నుంచి ప్రజారోగ్యం వరకు ప్రతి అంశంపై లోతైన పరిశోధనలు నిర్వహించి, కొత్త మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు శాస్త్రవేత్తలు.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
పాల ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి..
కర్నాల్‌లోని జాతీయ పాడి పరిశోధన సంస్థ (NDRI) పాలు, ఇతర ప్రోబయోటిక్ ఉత్పత్తులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనుంది. ఇందుకోసం ఢిల్లీలోని ఎయిమ్స్, పీజీఐ నిపుణుల సహాయం తీసుకోనున్నారు. ముఖ్యంగా డెంగ్యూ వంటి వ్యాధుల సమయంలో మేక పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలపై శాస్త్రీయ ఆధారాలను సేకరించడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశ్యమని ఎన్‌డీఆర్‌ఐ డైరెక్టర్ డాక్టర్ ధీర్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న అనేక సహజ చికిత్సలకు క్లినికల్ ట్రయల్స్ ద్వారా ప్రామాణికతను కల్పించనున్నారు.
రైతులకు చేరువగా శాస్త్రవేత్తలు..
వ్యవసాయంలో రసాయనాల వాడకాన్ని తగ్గించేందుకు శాస్త్రవేత్తలు నేరుగా క్షేత్రస్థాయిలోకి వెళ్లనున్నారు. నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. శాస్త్రవేత్తలు స్వయంగా పొలాలను సందర్శించి, మట్టి నమూనాలను సేకరిస్తారు. నేల ఆరోగ్యం, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రైతులకు తగిన సలహాలు అందిస్తారు.
పంటల దిగుబడితో పాటు నాణ్యతను పెంచి, తద్వారా పశువుల ఆరోగ్యాన్ని, మానవ జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ఈ మిషన్ లక్ష్యమని అధికారులు వెల్లడించారు. క్లినికల్ ట్రయల్స్ నివేదికల ఆధారంగా రూపొందించే కొత్త సలహా పత్రం భవిష్యత్తులో ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దిక్సూచిగా మారనుంది.
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com