స్వదేశీ సాంకేతికతో హెచ్‌పీవీ కిట్స్.. సులువుగా మారనున్న గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్‌..  

సాక్షి లైఫ్ : భారతదేశంలో గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణ కోసం స్వదేశీ సాంకేతికతతో తయారైన హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) టెస్ట్ కిట్‌లను ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ కిట్‌లు దేశీయంగా అభివృద్ధి చేసినవి కావడంతో, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్‌ను సులభతరం చేసి, ఖర్చును తగ్గించే అవకాశం ఉంది.  

 

ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు.. 

 

ఈ కిట్‌ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్క్రీనింగ్ సేవలు అందించ వచ్చని చెబుతున్నారు వైద్యనిపుణులు. 15ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయసు కలిగిన వారంతా స్క్రీనింగ్ చేయించుకోవడం గర్భాశయ క్యాన్సర్ నివారణకు కీలకంమని వారు చెబుతున్నారు. ఈ కిట్‌లు గ్రామీణ ఆరోగ్య సేవలకు వరంగా మారనున్నాయి.

జాతీయ క్యాన్సర్ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా, ఈ కిట్‌లను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భారత్‌లో ప్రతి ఐదుగురు గర్భాశయ క్యాన్సర్ బాధితుల్లో ఒకరు భారతీయ మహిళ కావడం గమనార్హం. ఈ స్వదేశీ కిట్‌లు, ఆర్‌టీ-పీసీఆర్ ఆధారిత సాంకేతికతతో, సాంప్రదాయ పాప్ స్మియర్ టెస్టుల కంటే తక్కువ ఖర్చుతో కూడిన స్క్రీనింగ్ పద్ధతిగా ఉపయోగపడనున్నాయి.

కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ కిట్‌లు భారత్‌ను నివారణ ఆరోగ్య సంరక్షణలో అగ్రగామిగా నిలపడానికి దోహదపడతాయని అన్నారు. ఈ కిట్‌ల అభివృద్ధి డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ) అండ్ బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బీఐఆర్‌ఏసీ) సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది.

ఈ కిట్‌లు గర్భాశయ క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడంలో సహాయపడటమే కాక, దేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చే దిశగా ఒక ముందడుగుగా నిలుస్తాయి. ఈ సాంకేతికత ద్వారా, గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళల సంఖ్యను గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని వైద్యనిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..ఫర్ క్వాలిటీ స్లీప్ : ఎలాంటి మార్పుల ద్వారా నాణ్యమైన నిద్ర పొందవచ్చు..?

ఇది కూడా చదవండి..స్లీప్ మాక్సింగ్ ట్రెండ్ ఆరోగ్యానికి ప్రమాదకరమా..?

ఇది కూడా చదవండి..ప్రోటీన్ లోపంవల్ల తలెత్తే 6 అనారోగ్య సమస్యలు..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : women-health women-health-problems hpv-vaccine cervical-cancer health-tests cervical-pain medical-tests cervical-cancer-free-vaccine free-cervical-vaccine-for-teen-age-girls hpv-vaccine-awareness human-papillomavirus hpv-awareness
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com