Diabetes Burden : ప్రపంచంలోనే రెండో స్థానంలో భారత్..! డయాబెటిస్ కారణంగా రూ. 11.4 లక్షల కోట్లు భారం..
సాక్షి లైఫ్ : గతంలో సంపన్న దేశాలకే పరిమితమని భావించిన మధుమేహం (Diabetes)ప్రస్తుతం భారత ఆర్థిక మూలాలను దెబ్బతీస్తోంది. ఈ మహమ్మారి కారణంగా దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక భారం విస్తుపోయేలా ఉందని తాజా అంతర్జాతీయ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మధుమేహం వల్ల అత్యధిక ఆర్థిక భారాన్ని మోస్తున్న దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో ఉండగా, మన పొరుగు దేశం చైనా మూడో స్థానంలో ఉంది.
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
రూ. 11.4 లక్షల కోట్ల భారం..!
ఆస్ట్రియాలోని వియన్నా యూనివర్సిటీ పరిశోధకులు 2020 నుంచి 2050 వరకు మధుమేహం వల్ల 204 దేశాలపై పడే ఆర్థిక ప్రభావాన్ని విశ్లేషించారు. 'నేచర్ మెడిసిన్' జర్నల్‌లో ప్రచురితమైన ఈ నివేదికలోని ముఖ్యాంశాలు..
డయాబెటిస్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై దాదాపు 11.4 ట్రిలియన్ డాలర్ల అంటే సుమారు రూ. 11.4 లక్షల కోట్లు భారం పడుతోంది.అమెరికా 16.5 ట్రిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా, చైనా 11 ట్రిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉంది. రోగులకు కుటుంబ సభ్యులు చేసే సేవలు, ఉపాధి కోల్పోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ భారం ప్రపంచ జీడీపీలో 1.7 శాతానికి సమానం.
ఎందుకీ భారం..?
భారత్‌లో ఈ స్థాయిలో ఆర్థిక భారం పెరగడానికి ప్రధాన కారణం 'బాధితుల సంఖ్య'. ప్రపంచంలోని మొత్తం మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో దాదాపు నాలుగో వంతు మంది భారత్‌లోనే ఉండటం ఆందోళన కలిగించే అంశం. వ్యాధి బారిన పడిన వారు పనిలో చురుగ్గా ఉండలేకపోవడం లేదా చనిపోవడం వల్ల దేశ మానవ వనరుల ఉత్పాదకత తగ్గుతోంది.
కిడ్నీ, గుండె సమస్యల వంటి అనుబంధ వ్యాధుల చికిత్సకు సామాన్యులు తమ ఆదాయంలో సింహభాగాన్ని వెచ్చించాల్సి వస్తోంది. సంపాదించే వ్యక్తి మధుమేహం బారిన పడితే, ఆ కుటుంబం పేదరికంలో పడే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
అల్జీమర్స్, క్యాన్సర్ కంటే ప్రమాదకరమా అంటే..?
మధుమేహం వల్ల కలిగే ఆర్థిక నష్టం అల్జీమర్స్ లేదా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల కంటే ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం తేల్చింది. ఇది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదు, ఒక దేశ పురోభివృద్ధిని అడ్డుకునే సామాజిక సంక్షోభమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పరిష్కారం ఏమిటి అంటే..?
మధుమేహాన్ని ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా ఆర్థిక, ఆరోగ్య నష్టాలను తగ్గించవచ్చు. సమతుల్య ఆహారం, నిరంతర వ్యాయామం మాత్రమే ఈ ముప్పు నుంచి గట్టెక్కించగలవు. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా రక్త పరీక్షలు చేయించుకోవాలి. జంక్ ఫుడ్ తగ్గించి, పీచు పదార్థాలు (Fiber) ఉన్న ఆహారం తీసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లోనూ మధుమేహంపై విస్తృత ప్రచారం జరగాలి. అప్పుడే డయాబెటిస్‌ను అదుపులో ఉంచడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా దేశ సంపదను కాపాడవచ్చు. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
