12వ వార్షిక సమావేశం నిర్వహించిన ఇన్ఫ్యూషన్ నర్సింగ్ సొసైటీ..

షేర్ చేయండి:
12వ వార్షిక సమావేశం నిర్వహించిన ఇన్ఫ్యూషన్ నర్సింగ్ సొసైటీ..

సాక్షి లైఫ్ : ఇన్ఫ్యూషన్ నర్సింగ్ సొసైటీ (ఐఎన్ఎస్) హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో తమ 12వ వార్షిక సమావేశాన్ని ‘అన్‌లీషింగ్ పవర్ అఫ్ ఇన్‌ఫ్యూషన్, నర్సింగ్ ఫర్ సస్టైనబుల్ హెల్త్‌కేర్’ అనే థీమ్ తో నిర్వహించింది. ఈ సదస్సులో ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఇన్ఫ్యూషన్ థెరపీ, నర్సింగ్ కేర్ రంగంలో కొత్త ఆవిష్కరణలు, ఉత్తమ విధానాలు, పురోగతి గురించి చర్చించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ దిలీప్‌కుమార్ మాట్లాడుతూ.. రోగి భద్రత, వైద్య ఫలితాలను మెరుగుపరచడంలో ఇన్ఫ్యూషన్ నర్సుల ముఖ్యమైన పాత్రను ఆయన వివరించారు. యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసి, వృత్తిపరమైన అభివృద్ధి , ఇన్ఫ్యూషన్ థెరపీ పురోగతికి ఐఎన్ఎస్ నిబద్ధతను ప్రశంసించారు.

 

ఇది కూడా చదవండి..మినరల్ వాటర్ పై ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ప్రకటన.. 

ఇది కూడా చదవండి..ఏవియన్ ఫ్లూ న్యూ వేరియంట్ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..? 

 

ఇది కూడా చదవండి..హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

 

ఈ సమావేశంలో ఐఎన్ఎస్ ఇండియా ప్రెసిడెంట్ కల్నల్ బిను శర్మ, ఇన్స్ కాన్ 2024 చైర్‌పర్సన్ డాక్టర్ జోతి క్లారా మైఖేల్, కో-చైర్ డాక్టర్ అమర్ బిరాదర్, సైనో థామస్ ఐఎన్ఎస్ చాప్టర్ హెడ్ జీసీ తదితరులు పాల్గొన్నారు. యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డిఎమ్ఎస్ డాక్టర్ లింగయ్య ముగింపు ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సదస్సులో చర్చలు, వర్క్‌షాప్‌లు, సైంటిఫిక్ సెషన్లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీడీ మాస్టర్‌మైండ్ క్విజ్, పేపర్ ప్రెజెంటేషన్లు, ఉపన్యాసాలు, వీడియో పోటీలు, ఈ-పోస్టర్‌లు, క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టులు వంటి విభిన్న పోటీల ద్వారా ప్రతిభను ప్రదర్శించేందుకు వేదికగా నిలిచింది. దేశవ్యాప్తంగా 1200 మందికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో డాక్టర్ టి. దిలీప్‌కుమార్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందించారు.

 

ఇది కూడా చదవండి..యూరిక్ యాసిడ్ తగ్గాలంటే వీటిని అస్సలు తినకండి.. 

ఇది కూడా చదవండి..ఫస్ట్ యాంటీబయాటిక్ స్మార్ట్ సెంటర్‌.. 

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.

ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.