ఇడ్లీల తయారీలో ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించిన కర్ణాటక ప్రభుత్వం.. 

సాక్షి లైఫ్ : కర్ణాటక ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని హోటళ్లలో ఇడ్లీ తయారీలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించింది. పాలిథిన్ షీట్ల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. పలు హోటళ్ళు ఈ షీట్లను ఉపయోగించడం ద్వారా ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నాయి. ఈ కేసులో రాష్ట్రవ్యాప్తంగా 54 మందిపై చర్యలు తీసుకున్నారు.

ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించే బెస్ట్ ఫుడ్..

ఇది కూడా చదవండి..వినికిడి లోపం ఎలాంటి వారిలో ఎక్కువగా కనిపిస్తుంది..?

ఇది కూడా చదవండి..నాన్-స్టిక్ కుక్ వేర్ తో ఐదు రకాల ప్రమాదాలు.. 

 

కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండూ రావు గురువారం ఇడ్లీల తయారీలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. కర్ణాటక ఆహార భద్రతా విభాగం జరిపిన తనిఖీలో 52 హోటళ్లు ఇడ్లీ తయారు చేయడానికి పాలిథిన్ షీట్లను ఉపయోగిస్తున్నట్లు తేలిందని ఆయన వెల్లడించారు.

పాలిథిన్ షీట్లతో క్యాన్సర్ ప్రమాదం.. 

పాలిథిన్ షీట్ల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అయినప్పటికీ, పలు హోటళ్ళు ఈ షీట్లను ఉపయోగిస్తూనే ఉన్నాయి. దీనికారణంగా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నాయి. ఈ కేసులో రాష్ట్రవ్యాప్తంగా 54 మందిపై చర్యలు తీసుకున్నారు.

కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 251 ప్రదేశాల నుంచి ఆహార భద్రతా విభాగం ఇడ్లీ నమూనాలను సేకరించిందని, గతంలో ఇడ్లీలు వండడానికి వస్త్రాన్ని ఉపయోగించేవారు, కానీ ఇటీవల హోటళ్లు ప్లాస్టిక్ వాడటంతో అధికారులు వివిధ ప్రదేశాలకు వెళ్లి దర్యాప్తు చేశారు. 251 హోటళ్లలో 52 హోటళ్లలో ప్లాస్టిక్ వాడుతున్నట్లు గుర్తించారని కర్ణాటక ఆరోగ్య మంత్రి తెలిపారు. 

ఇడ్లీల తయారీలో ప్లాస్టిక్‌ను ఉపయోగించినప్పుడు, విషపూరిత రసాయనాలు ఆహారంలోకి చేరి, వినియోగదారుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తాయి. కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని వెంటనే ఆపివేసి, స్టెయిన్‌లెస్ స్టీల్ ప్లేట్లు లేదా అరటి ఆకులు వంటి సురక్షితమైన ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని మంత్రి అన్నిహోటళ్లకు ఆదేశాలు జారీ చేశారు.  

 

ఇది కూడా చదవండి..HKU5-CoV-2 : చైనాలో మరో కరోనా కొత్త వైరస్.. అదీ అంటువ్యాధేనా..?

ఇది కూడా చదవండి..ఎలాంటి ఫుడ్ తీ సుకోవడం ద్వారా హిమోగ్లోబిన్‌ ను పెంచుకోవచ్చు..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : risk karnataka food-safety-act health-minister-dinesh-gundu-rao food-safety food-safety-and-quality-department health-risks public-safety cancer-risk-factors cancer-risks food-safety-and-standards-authority-of-india cooking-safety karnataka-government plastic-ban plastic-sheets plastic-usage karnataka-health-minister food-safety-inspection hotel-safety stainless-steel-plates banana-leaves plastic-ban-enforcement
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com