HKU5-CoV-2 : చైనాలో మరో కరోనా కొత్త వైరస్.. అదీ అంటువ్యాధేనా..?

షేర్ చేయండి:
HKU5-CoV-2 : చైనాలో మరో కరోనా కొత్త వైరస్.. అదీ అంటువ్యాధేనా..?

సాక్షి లైఫ్ : ఇటీవల చైనాలో మరొక కరోనా కొత్త వైరస్ కలకలం రేపుతోంది. గబ్బిలాలలో కనిపించే ఈ కొత్త వైరస్ కోవిడ్-19 లాగా మానవులకు వ్యాపిస్తుంది. ఈ కొత్త కరోనావైరస్ కు "HKU5-CoV-2" అని పేరు పెట్టారు. ఇప్పుడు దీనిపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త వైరస్ కొత్త అంటువ్యాధికి కారణమవుతుందో లేదా..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..  

 

ఇది కూడా చదవండి..HbA1c స్థాయి 10 కంటే ఎక్కువగా ఉంటే ఏమౌతుంది..?

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఎలాంటి మూలికలు రక్తపోటును నియంత్రించడంలోసహాయపడతాయి..?

 

 కరోనావైరస్ ముగిసినప్పటికీ, దాని భయం ఇప్పటికీ ప్రజలలో ఉంది. ఈ మహమ్మారి బాధను ప్రజలు ఇంకా మర్చిపోలేదు,  ఇంతలోనే మరొక  కొత్త కరోనావైరస్ వచ్చింది. ఈ కొత్త కరోనావైరస్‌ను చైనీస్ వైరాలజిస్ట్ షి జెంగ్లీ నేతృత్వంలోని వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరిశోధనా బృందం కనుగొంది.

శాస్త్రవేత్తలు ఈ కొత్త కరోనావైరస్ కు HKU5-CoV-2 అని పేరు పెట్టారు. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఈ కొత్త వైరస్ కూడా కొన్ని సంవత్సరాల క్రితం COVID-19 వైరస్ వల్ల కలిగే సమస్యలను కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. గబ్బిలాలలో, ఈ కొత్త కరోనావైరస్ COVID-19కు కారణమయ్యే మార్గాన్ని ఉపయోగించి కణాలలోకి ప్రవేశించగలదు.

 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.