Health camp : సచివాలయంలో హెల్త్ క్యాంప్ ను ప్రారంభించిన మంత్రి దామోదర రాజనర్సింహా..
సాక్షి లైఫ్ : తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా హైదరాబాద్ లోని డా. బి. ఆర్. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని మూడో అంతస్థులో సెక్రటేరియట్ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఏఐ బేస్డ్ (AI Based) మెగా కార్డియాక్ హెల్త్ క్యాంపును ప్రారంభించారు.
ఇది కూడా చదవండి..Rainy Season : వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని కూరగాయలు
ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?
ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఈ హెల్త్ క్యాంపులో సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది అత్యాధునిక ఎక్విప్మెంట్ సాయంతో బీపీ, ఈసీజీ, టూడీ ఎకో పరీక్షలను నిర్వహించారు. కార్డియాలజీ, జనరల్ ఫీజిషన్ సేవలను ఉద్యోగులకు అందించారు.
ఈ సందర్బంగా మంత్రి దామోదర్ రాజనర్సింహా మాట్లాడుతూ.. మారుతున్న జీవన శైలిలలో భాగంగా ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహా. సచివాలయ ఉద్యోగులకు హెల్త్ క్యాంపు పెట్టి వైద్య సేవలను, పరీక్షలను ఉచితంగా అందించిన రేనోవా ఆసుపత్రి వైద్య సిబ్బందిని మంత్రి దామోదర్ రాజనర్సింహా అభినందించారు.
ఇది కూడా చదవండి...బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
