భారత్‌లో కొత్త కరోనా వేరియంట్స్ NB.1.8.1, LF.7 గుర్తింపు..  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : దేశంలో కోవిడ్ మహమ్మారి కేసులు మరోసారి పెరుగు తున్నాయి. ఈ సారి కొత్త వేరియంట్ల రూపంలో పడగ విపుతోంది. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో కొత్త కరోనా సబ్‌వేరియంట్‌లు NB.1.8.1 అండ్ LF.7 లను గుర్తించారు. ఇవి ప్రస్తుతం దేశంలో ఎక్కువగా వ్యాప్తిలో ఉన్న JN.1 వేరియంట్ కు దగ్గరగా ఉన్నట్లు ఇండియన్ SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్టియం (INSACOG) తెలిపింది.

ఇది కూడా చదవండి.. వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?

 ఇది కూడా చదవండి.. వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..  

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

ఏప్రిల్‌లో తమిళనాడులో NB.1.8.1 కేసు నమోదవ్వగా, మే నెలలో గుజరాత్‌లో LF.7 వేరియంట్‌కు సంబంధించి నాలుగు కేసులు వెలుగుచూశాయి.

నోయిడాలో తొలి కేసు, ఎయిమ్స్ రిషీకేశ్‌లో మూడు కేసులు.. 

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో 55 ఏళ్ల మహిళకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుత కరోనా వేవ్‌లో ఆ జిల్లాలో నమోదైన మొదటి కేసు ఇదే కావడం గమనార్హం. ఆమె ఇటీవల రైలులో ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆమె హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్‌గా వచ్చింది.

 ప్రస్తుతం గుర్తించిన వేరియంట్ "తీవ్రమైనది కాదు" అయినప్పటికీ, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.