సాక్షి లైఫ్: ఇప్పుడు ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేయడం మరింత సులభం కానుంది. ఎందుకంటే కొత్త సంవత్సరంలో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన నియమాలు మారుతున్నాయి. భారతదేశంలో ఆరోగ్య బీమా కోసం ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐ.ఆర్.డీ. ఏ) కొత్త నిబంధనలను అమలు చేయనుంది.
ఇప్పుడు ఆరోగ్య బీమా కంపెనీలు ఆరోగ్య బీమా పాలసీకి సంబంధించిన అన్ని ముఖ్యమైన సమాచారాన్ని కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్‌లో పాలసీ హోల్డర్‌కు సాధారణ పదాలలో అందించాల్సి ఉంటుంది.
కొత్త సర్క్యులర్..
ఆరోగ్య బీమా పాలసీల జారీకి సంబంధించి దేశంలోని అన్ని బీమా కంపెనీలకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐ.ఆర్.డీ. ఏ) కొత్త సర్క్యులర్‌ను జారీ చేసింది. ఈ సర్క్యులర్‌లో, దేశంలోని అన్ని బీమా కంపెనీలకు 2024 సంవత్సరంలో జనవరి ఇకటవ తేదీ తర్వాత, వారు ఏ ఆరోగ్య బీమా పాలసీని జారీ చేసినా, వారు పాలసీదారునికి కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్‌ను కూడా అందించాలని ఆదేశాలు జారీ చేసింది.
బీమా కంపెనీలు పాలసీ వివరాలు ఇవ్వాలి..
సరళంగా చెప్పాలంటే, ఇప్పుడు ఆరోగ్య బీమా కంపెనీలు ఆరోగ్య బీమా పాలసీకి సంబంధించిన అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్‌లో పాలసీ హోల్డర్‌కు సాధారణ పదాలలో అందించాలి. పాలసీ కవరేజీ ఎంత..? ఈ పాలసీ వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో వారికి తెలియజేయాల్సి ఉంటుంది. దీనితో పాటు, పాలసీ హోల్డర్ ఆరోగ్య బీమా క్లెయిమ్ చేయాలనుకుంటే దాని ప్రక్రియ ఏమిటో కూడా ఆరోగ్య బీమా కంపెనీలు ముందుగానే చెప్పాలి. వారికి ఏదైనా ఫిర్యాదు ఉంటే, ఫిర్యాదు పరిష్కారానికి కంపెనీ ఏ ప్రమాణాలను రూపొందించింది..? ఇందులో, కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్‌లో గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ ను సంప్రదించడానికి అవసరమైన సమాచారం కూడా షేర్ చేయాల్సి ఉంటుంది.
పాలసీని కొనుగోలు చేసిన తర్వాత, మీరు దానిని పరిమిత సమయం వరకు రద్దు చేసుకోవచ్చు.
పాలసీదారు ఎవరైనా ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేసిన తర్వాత దానిని రద్దు చేయాలనుకుంటే, అతనికి కూడా ఈ అవకాశం ఉంటుందని బీమా రెగ్యులేటర్ తొలిసారిగా బీమా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది.
ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేసిన తర్వాత..
ఇప్పుడు ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేసిన తర్వాత, బీమా పాలసీదారు ఈ పాలసీ తనకు సరిపోదని భావిస్తే, పరిమిత కాలానికి పాలసీని రద్దు చేసుకోవచ్చు.కానీ ఈ సదుపాయం పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ పరిమితిని బీమా కంపెనీలు నిర్ణయిస్తాయి.
బీమా క్లెయిమ్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండదు..
ఇలా చేయడం వల్ల బీమా క్లెయిమ్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండదు.
దీనితో పాటు, ప్రతి పాలసీ హోల్డర్, ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేసేటప్పుడు, భవిష్యత్తులో బీమా క్లెయిమ్‌లలో ఎటువంటి సమస్య లేకుండా పారదర్శకంగా బీమా కంపెనీలకు కస్టమర్లు తమ ఆరోగ్యానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని అందించాలి.
బీమా రెగ్యులేటర్ ప్రకారం, దేశంలో ప్రస్తుతం ఉన్న బీమా పాలసీల కొనుగోలు , విక్రయ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్ధవంతంగా చేయడం కోసమే కొత్త నిబంధనలు అమలు చేస్తున్నారు.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com