Nipah Virus : చైనాలో వణికిస్తున్న నిఫా వైరస్ భారత సరిహద్దుల్లో హై అలర్ట్..!
సాక్షి లైఫ్ : భారత్‌లోని పశ్చిమ బెంగాల్‌లో వెలుగుచూసిన ప్రాణాంతక 'నిఫా' వైరస్ ఇప్పుడు పొరుగు దేశం చైనాను వణికిస్తోంది. ముఖ్యంగా మరికొద్ది రోజుల్లో రానున్న చైనీస్ లూనార్ న్యూ ఇయర్ వేళ కోట్లాది మంది ప్రయాణాలు చేయనున్న నేపథ్యంలో, ఈ వైరస్ ఎక్కడ వ్యాప్తి చెందుతుందోనని అక్కడి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో ఈ కేసులు వెలుగుచూడటంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. సరిహద్దుల్లో నిఘాను పెంచినట్లు అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఏమిటీ వైరస్..? ఎందుకు ఇంత భయం..?
నిఫా వైరస్ (NiV) అనేది జంతువుల నుంచి మనుషులకు సోకే ఒక ప్రమాదకరమైన వైరస్. దీని మరణాల రేటు అత్యధికంగా 40 నుంచి 75 శాతం వరకు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. దీనికి ఇప్పటివరకు ఎటువంటి నిర్దిష్టమైన టీకా (Vaccine) లేదా చికిత్స అందుబాటులో లేకపోవడమే ఈ ఆందోళనకు ప్రధాన కారణం.
లక్షణాలు ఎలా ఉంటాయి అంటే..?
ఈ వైరస్ బారిన పడిన వారిలో సాధారణ జ్వరం నుంచి మెదడు వాపు (Encephalitis) వరకు రకరకాల లక్షణాలు కనిపిస్తాయి.
తీవ్రమైన జ్వరం, తలనొప్పి.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు.
మూర్ఛ, కోమాలోకి వెళ్లడం.
కొన్నిసార్లు ఎటువంటి లక్షణాలు లేకుండానే వ్యాధి ముదిరే ప్రమాదం ఉంది.
వ్యాప్తి ఎలా జరుగుతుంది..?
ముఖ్యంగా పండ్లను తినే గబ్బిలాలు (Fruit Bats) ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. గబ్బిలాలు కొరికిన పండ్లు తినడం, లేదా అవి విసర్జించిన లాలాజలం, మూత్రం ద్వారా కలుషితమైన పదార్థాలను ఉదాహరణకు తాటి కల్లు లేదా ఖర్జూర రసం సేవించడం వల్ల మనుషులకు సోకుతుంది. వ్యాధి సోకిన వ్యక్తికి దగ్గరగా ఉండటం వల్ల కూడా ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది.
నిపుణులు ఏమంటున్నారు..?
చైనాలోని వుహాన్ యూనివర్సిటీ వైరాలజిస్టుల ప్రకారం.. ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి కానీ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. గాలి ద్వారా వ్యాపించే కరోనా అంత వేగంగా నిఫా వ్యాపించదని, కేవలం శరీర ద్రవాల ద్వారానే ఇది సంక్రమిస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు.
జాగ్రత్తలు ఇవే..
చెట్ల నుంచి నేరుగా పడిన, గబ్బిలాలు కొరికిన పండ్లను తినకూడదు. పరిశుభ్రత పాటించడం, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ముఖ్యం. వ్యాధి లక్షణాలు ఉన్నవారికి దూరంగా ఉండాలి.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
