Radiation More Dangerous Than Nuclear Bomb : అణు బాంబు కంటే డేంజర్.. రేడియేషన్ ఎఫెక్ట్ ..! 'డబ్ల్యూహెచ్‌ఓ' ఆందోళన.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఇరాన్ అణు కేంద్రాల భద్రతపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఒకవేళ పొరపాటున ఈ అణు కేంద్రాలపై దాడి జరిగితే, అది కేవలం తక్షణ ప్రాణనష్టంతోనే ఆగదని.. దాని రేడియేషన్ ప్రభావం తరతరాల పాటు ఆరోగ్యంపై వినాశకరమైన పరిణామాలను చూపుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది.

 

ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..Coconut Water : కొబ్బరి బొండం నీళ్లతో బరువు తగ్గొచ్చా..?

 

వినాశకరమైన ఆరోగ్య ముప్పు..

ఇరాన్‌లోని అణు కేంద్రాల రక్షణపై డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయెసస్ ఆదివారం కీలక ప్రకటన చేశారు. అణు కేంద్రాలపై దాడులు జరిగితే సంభవించే అణు విస్ఫోటనం లేదా లీకేజీ వల్ల వెలువడే రేడియోధార్మికత మానవ జన్యువులపై ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు. ఇది భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డల్లో వైకల్యానికి, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుందని, ఈ వినాశనం ఊహాతీతమని ఆందోళన వ్యక్తం చేశారు.

 

బుషెహర్ ఘటనపై ఐఏఈఏ (IAEA) నివేదిక.. 

ఇటీవల బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం సముదాయం సమీపంలో క్షిపణి పడిన ఉదంతాన్ని అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ (IAEA) ప్రస్తావించింది. క్షిపణి శకలాలు తగిలి ఒక భద్రతా సిబ్బంది మరణించగా, అక్కడి భవనం పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం.
గత కొద్ది వారాల్లో ఇలాంటి సంఘటన జరగడం ఇది నాలుగోసారి అని ఐఏఈఏ వెల్లడించింది.

ప్రస్తుతానికి రేడియేషన్ స్థాయిల్లో ఎటువంటి మార్పు లేదని, అంతా సురక్షితంగానే ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతం పెరుగుతున్న ఉద్రిక్తతలు అణు ప్రమాదాల ముప్పును పెంచుతు న్నాయి. మనం తక్షణమే ఘర్షణలను తగ్గించాల్సిన అవసరం ఉంది. ఈ యుద్ధ వాతావరణంలో శాంతే అన్నిటికంటే గొప్ప ఔషధం అని టెడ్రోస్ అధనోమ్, డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ చెబుతున్నారు.

ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త..!

అణు కేంద్రాల రక్షణ విషయంలో అంతర్జాతీయ నియమ నిబంధనలను పాటించాలని, ఏ మాత్రం అజాగ్రత్త వహించినా అది ప్రపంచ ఆరోగ్య సంక్షోభానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రాఫెల్ మరియానో గ్రాస్సీ సైతం ఈ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, శాంతియుత చర్చల ద్వారానే పరిష్కారం కనుగొనాలని కోరారు.

 

ఇది కూడా చదవండి..Brain health : మీ బ్రెయిన్ కంప్యూటర్ లాగా పనిచేయాలంటే ఈ ఆహారపదార్థాలు తినండి..

ఇది కూడా చదవండి..Prediabetes : ప్రీడయాబెటిస్‌ కు గుండె జబ్బుల ప్రమాదానికి లింక్ ఏంటి..?

ఇది కూడా చదవండి..Obesity and inflammation : ఒబెసిటీకి ఇన్‌ఫ్లమేషన్‌కు లింక్ ఏమిటి..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.