సాక్షి లైఫ్ : రాజస్థాన్‌లోని కరౌలిలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐవీఆర్ఐ)నమూనాలలో నిర్ధారించి నివేదికను పంపింది. జూలైలో పంజాబ్, హర్యానాలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. పందుల మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంది.
ఇది కూడా చదవండి..బైల్ డక్ట్ క్యాన్సర్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..అధిక రక్తపోటుకు బ్రెయిన్ స్ట్రోక్ కు లింక్ ఏంటి..?
పందులకు ప్రాణాంతకమైన ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ రాజస్థాన్‌లోని కరౌలి జిల్లాలో విపరీతంగా వ్యాపిస్తోంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అక్కడ వచ్చిన ఐదు నమూనాలలో వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. నాలుగు రోజుల క్రితం, ఆ సంస్థ తన నివేదికను రాజస్థాన్‌కు పంపింది. జూలైలో, పంజాబ్, హర్యానాలోని కొన్ని ప్రదేశాల నుంచి వచ్చిన నమూనాలలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ఉన్నట్లు గుర్తించారు.
బర్డ్ ఫ్లూ తర్వాత, ఇప్పుడు పందులలో తీవ్రమైన వ్యాధి అయిన ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసులు కూడా పాజిటివ్‌గా వస్తున్నాయి. రాజస్థాన్‌లోని కరౌలి ,జైపూర్ జిల్లాలు, హర్యానాలోని డాచి, పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసులను గుర్తించారు.
ఈ వ్యాధి నిర్ధారణతో, దీనికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేస్తున్నారు. జూలైలో వేర్వేరు తేదీలలో పంజాబ్, హర్యానా, రాజస్థాన్ నుండి ఐదు నమూనాలు వచ్చాయని సంస్థ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది మానవులపై ఎటువంటి ప్రభావం చూపదని వారు అంటున్నారు.
మొదట, పంజాబ్, తరువాత హర్యానా నుంచి వచ్చిన నమూనాలను పరీక్షించారు, అందులో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ఉన్నట్లు కనుగొన్నారు. దీని తరువాత, రాజస్థాన్‌లోని కరౌలి నుంచి నమూనాలను పరీక్షించారు. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్ ఉన్నట్లు నిర్ధారించారు.
ఇతర పందులు దాని బారిన పడకుండా సోకిన పందులను వేరుగా ఉంచాలని సూచిస్తున్నారు వెటర్నరీ డాక్టర్స్. ఈ వైరస్ సోకిన పందులలో 90 శాతం వరకు అవి చనిపోతున్నాయని, దేశంలో ఐదు సంవత్సరాల క్రితం ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసులు మొదటిసారిగా నమోదయ్యాయని ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ త్రివేణి దత్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి..For health : కుంకుమ పువ్వు"టీ"తో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com