Honeybee Attacks : అస్సాంలో తేనెటీగల దాడి వల్ల పెరుగుతున్న మరణాల సంఖ్య.. నిపుణుల హెచ్చరిక..
సాక్షి లైఫ్ : ప్రకృతిలో కనిపించే తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేస్తే అది ప్రాణాపాయానికి దారితీస్తుందని మీకు తెలుసా..? అస్సాం రాష్ట్రంలో ఏటా సుమారు 15 నుంచి 20 మంది తేనెటీగల దాడి (Bee Envenomation) వల్ల మరణిస్తున్నారని ఐసీఎంఆర్ (ICMR) నిపుణులు డాక్టర్ సురజిత్ గిరి హెచ్చరిస్తున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల తేనెటీగల దాడులు పెరిగాయని, వీటిని కేవలం చిన్న సమస్యగా చూడటం వల్లనే మరణాలు సంభవిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..Top Medical Researches of 2025: వైద్య రంగంలో సరికొత్త సాంకేతికత: 2025 టాప్ రీసెర్చెస్..
తక్షణమే..
తేనెటీగ కుట్టినప్పుడు విడుదలయ్యే విషం శరీరంలో తీవ్రమైన అలర్జీకి కారణమవుతుంది. సకాలంలో వైద్యం అందకపోతే 48 నుంచి 72 గంటల్లో కిడ్నీలు దెబ్బతినే (Kidney Failure) ప్రమాదం ఉంది. చర్మంపై ఉన్న తేనెటీగ ముల్లు (Stinger) నుంచి విషం నిరంతరం శరీరంలోకి చేరుతూనే ఉంటుంది.
తేనెటీగలు చుట్టుముట్టినప్పుడు ఏం చేయాలి..?
తేనెటీగలు చుట్టుముట్టినప్పుడు చాలామంది నీటిలోకి దూకుతుంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మనం ఎంతసేపు నీటిలో ఉన్నా, అవి పైన వేచి చూస్తాయి. దానికి బదులుగా దట్టమైన పొదల్లోకి వెళ్లడం ఉత్తమం.
ప్రథమ చికిత్స ఎలా చేయాలి..?
చర్మానికి గుచ్చుకున్న ముల్లును గోళ్లతో మెల్లగా తొలగించాలి. పొరపాటున కూడా వాటిని నొక్కకూడదు. అలా చేస్తే ముల్లుకు ఉండే విషపు సంచిలోని విషం పూర్తిగా శరీరంలోకి వెళ్తుంది. ప్రభావిత ప్రాంతాన్ని సబ్బు, నీటితో శుభ్రం చేయాలి.తీవ్రమైన లక్షణాలు ఆలస్యంగా బయటపడే అవకాశం ఉన్నందున, కనీసం 24 గంటల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం ఎంతో ముఖ్యం. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులు, ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉంటే చాలా మరణాలను నివారించవచ్చని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..Best foods: కొలెస్ట్రాల్‌ను సహజంగా తగ్గించే ఆహార పదార్థాలు ఏవి..?
ఇది కూడా చదవండి..Betel Leaves Help Reduce Cholesterol : తమలపాకు తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందా..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
