Cold Winds : చలిగాలులతో పెరుగుతున్న సీజనల్‌ ఫ్లూ కేసులు.. జాగ్రత్త..   

షేర్ చేయండి:
Cold Winds : చలిగాలులతో పెరుగుతున్న సీజనల్‌ ఫ్లూ కేసులు.. జాగ్రత్త..   

సాక్షి లైఫ్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో చలిగాలులు పెరగడంతో పాటు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశం ఉండటంతో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు, సీజనల్ ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం చేస్తోంది.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?

లక్షణాలు ఎలా ఉంటాయి..? 

అకస్మాత్తుగా వచ్చే తీవ్రమైన జ్వరం, గొంతు నొప్పి.విడవని దగ్గు, ఒళ్లు నొప్పులు, విపరీతమైన అలసట.తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా ఇది ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. సబ్బుతో తరచూ చేతులు కడుక్కోవాలి. కళ్లు, ముక్కు, నోటిని మాటిమాటికీ తాకకూడదు. రద్దీ ప్రదేశాలకు వెళ్లకపోవడమే మంచిది. అనారోగ్యంతో ఉన్నవారికి కరచాలనం చేయడం వంటివి మానుకోవాలి.


పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు తగినంత నీరు తాగుతూ ఉండాలి. గోరువెచ్చని నీటిని తీసుకోవడం మేలు. గర్భిణులు, ఐదేళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఫ్లూ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నట్లయితే తక్షణమే ఆసుపత్రికి వెళ్లాలి.

 రోగనిరోధకత కోసం..

ఆరోగ్యకర ఆహారం, వ్యాయామం ఎంత ముఖ్యమో, కంటి నిండా నిద్ర పోవటమూ అంతే ముఖ్యం. నిద్ర, రోగనిరోధక వ్యవస్థ రెండూ ఒకదాంతో మరోటి ముడిపడి ఉంటాయి. నిద్ర పోతున్నప్పుడు రోగనిరోధక శక్తికి దన్నుగా నిలిచే రకరకాల కీలక ప్రక్రియలు మన శరీరంలో కొనసాగుతాయి.

మెరుగైన ఆరోగ్యం కోసం మూడు సూత్రాలు.. 
 
ఉదయాన్నే ఏదైనా ఒక పండు లేదా రాత్రంతా నానబెట్టిన కొన్ని బాదం పప్పులను తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇది రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. భోజనంలో టీస్పూన్ నెయ్యి వేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. నెయ్యిలో ఏ, డి, ఈ, కే వంటి కొవ్వును కరిగించే విటమిన్లు ఉంటాయి. రోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం చేయడం వల్ల నిద్ర మెరుగుపడుతుంది. తద్వారా వ్యాధుల ముప్పు తగ్గుతుంది.

 

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే....? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.