వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి.. 

షేర్ చేయండి:
వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి.. 

సాక్షి లైఫ్ : తెలంగాణలో గత పదిహేను రోజులుగా కురుస్తున్న వర్షాలకు సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తు న్నారు. సకాలంలో సరైన నివారణ చర్యలు తీసుకోకపోతే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయని వారు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో సీజనల్ డిసీజెస్  కేసుల సంఖ్య పెరుగుతుందని, గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పటి వరకు ఈ కేసుల సంఖ్య తక్కువగా ఉందని, అయినప్పటికీ, ప్రజలు అంటువ్యాధులు రాకుండా అవసరమైన అన్ని నివారణ చర్యలు తీసుకోవాలని వైద్యులుహెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి.. బ్యాక్టీరియా ఎలా సంక్రమిస్తుంది..? 

చికున్‌గున్యా, డెంగ్యూ, మలేరియా.. 

వర్షాకాలంలో చికున్‌గున్యా, డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఎక్కువ. ప్రజలు సురక్షితంగా ఉంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, జ్వరం ఎక్కువరోజులపాటు ఉంటే తప్పనిసరిగా  వైద్యులను సంప్రదించాలని వారు చెబుతున్నారు.

ఈ వర్షాలు ఆస్తమాను కూడా తీవ్రతరం చేస్తాయని, సూర్యరశ్మి తగ్గడం వల్ల శరీరంలోని విటమిన్ "డి" స్థాయిలు తగ్గుతాయని దీనికారణంగానే అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు అంటున్నారు. 

వర్షాకాలంలో..

వర్షాకాలంలో తేమ పెరగడం వల్ల ఆస్తమా కేసులు పెరుగుతాయని కాబట్టి ఈ సమయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.ఫ్లూ,జలుబు రాకుండా ఉండాలంటే వర్షంలో తడవకుండా ఉండడం తోపాటు, తరచుగా చేతులు కడుక్కోవాలని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి..?  

 

ఇది కూడా చదవండి.. హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..?  


గమనికఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.