'విషపూరిత' కాఫ్ సిరప్‌ : 24 మంది చిన్నారుల మృతిపై ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్‌ఓ 

సాక్షి లైఫ్ : భారతదేశంలో కల్తీ కాఫ్ సిరప్‌లు (Toxic Cough Syrups) సేవించి 24 మందికి పైగా చిన్నారులు మృతి చెందిన ఘటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషాదం నేపథ్యంలో, విషపూరిత ఔషధాల అమ్మకాలను అరికట్టడానికి భారతదేశం "ఇంకా చాలా చర్యలు తీసుకోవాల్సి ఉందని" డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి..Latest study : మధుమేహ బాధితుల కోసం సరికొత్త ఔషధాన్ని కనుగొన్న నాగాలాండ్‌ యూనివర్సిటీ పరిశోధకులు.. 

ఇది కూడా చదవండి..జికా వైరస్ డెంగ్యూ జ్వరాన్ని పోలి ఉంటుందా..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు 

మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలోని కొన్ని ప్రాంతాల్లో, శ్రీసన్ ఫార్మా (Srisan Pharma) తయారు చేసిన 'కోల్డ్‌రిఫ్' (Coldrif) అనే దగ్గు సిరప్ తాగిన 24 మందికి పైగా చిన్నారులు కిడ్నీలు దెబ్బతిని మరణించారు. ప్రయోగశాల పరీక్షల్లో, ఈ సిరప్‌లో డైఎథిలీన్ గ్లైకాల్ (Diethylene Glycol - DEG) అనే ప్రమాదకర రసాయనం ఉండాల్సిన పరిమితి కంటే దాదాపు 500 రెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. డీఈజీ అనేది పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే రసాయనం. దీనిని ఔషధాల్లో ఉపయోగించడం ప్రాణాంతకం.

డబ్ల్యూహెచ్‌ఓ చేసిన కీలక వ్యాఖ్యలు ఏమిటంటే..?  

ఔషధాల భద్రత విషయంలో భారత్ తీసుకున్న చర్యలను డబ్ల్యూహెచ్‌ఓ స్వాగతించినప్పటికీ, ఇంకా అనేక లోపాలు ఉన్నాయని డబ్ల్యూహెచ్‌ఓ అధికారి రుటెండో కువానా వెల్లడించారు.

స్థానిక అమ్మకాలపై లోపం (Regulatory Gap).. "ఔషధాల ఎగుమతికి ముందు కల్తీ పరీక్షలు తప్పనిసరి చేస్తూ భారత్ కొత్త నిబంధన తీసుకువచ్చింది. ఇది మంచి చర్య. అయితే, దేశంలో స్థానికంగా అమ్ముడయ్యే సిరప్‌ల విషయంలో ఇలాంటి కఠిన పరీక్షలకు నిబంధన లేదు. ఇది ఒక తీవ్రమైన నియంత్రణ లోపం (Regulatory Gap)." అని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది.

  "భారతదేశం పెద్ద మార్కెట్. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఫార్మా తయారీకంపెనీలు పలు రాష్ట్రాల్లో ఉన్నాయి. కాబట్టి, ఔషధ భద్రతను పూర్తిగా పర్యవేక్షించడానికి మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ (Work in Progress)" అని డబ్ల్యూహెచ్‌ఓ అధికారి కువానా తెలిపారు.

 గతంలో విదేశాలకు ఎగుమతి అయిన కల్తీ సిరప్‌ల కారణంగా ఇతర దేశాలలో వందలాది మంది చిన్నారులు మరణించినప్పటికీ, భారత్‌లో నేటికీ ఎవరికీ జైలు శిక్ష పడిన దాఖలాలు లేవని, ఇది 'సరైనది కాదు', ఆందోళన కలిగించే విషయం అని డబ్ల్యూహెచ్‌ఓ అభిప్రాయపడింది.

ప్రమాదకర సిరప్‌లపై గ్లోబల్ అలెర్ట్.. 

ప్రమాదకర డీఈజీ కల్తీ ఉన్నట్లు గుర్తించిన కోల్డ్‌రిఫ్, రెస్పిఫ్రెష్ టీఆర్, రీలైఫ్ అనే మూడు సిరప్‌ల గురించి డబ్ల్యూహెచ్‌ఓ ప్రపంచవ్యాప్తంగా హెచ్చరిక (Global Alert) జారీ చేసింది. ఔషధాల ఉత్పత్తిదారులు, ప్రభుత్వాలు కఠినమైన నిబంధనలను పాటించకపోవడం నైతిక సమస్య మాత్రమే కాదు, ప్రాణాంతక పరిణామాలు సృష్టించే నేరంగా పరిగణించాలి అని డబ్ల్యూహెచ్‌ఓ ఉద్ఘాటించింది.

ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?

 ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : kids-health who world-health-organization toxic-chemicals who-guidelines who-monitoring toxic-cough-syrup kidney-failure-in-children toxic-coldrif-syrup-case
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com