Melatonin : మెలటోనిన్ మాత్రలు ఎక్కువగా వాడితే ఏమౌతుంది..?  

సాక్షి లైఫ్ : చాలా మంది నిద్ర సమస్యల కోసం 'సహజమైన' నిద్ర మాత్రగా భావించి తీసుకునే మెలటోనిన్ సప్లిమెంట్స్ (Melatonin Supplements) దీర్ఘకాలిక వినియోగంపై శాస్త్రవేత్తలు సంచలన హెచ్చరిక చేశారు. ఈ మాత్రలను ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం వాడేవారిలో గుండె వైఫల్యం (Heart Failure) ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని ఒక తాజా ప్రాథమిక అధ్యయనం వెల్లడించింది.

 

ఇది కూడా చదవండి..అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

 ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

 

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) సైంటిఫిక్ సెషన్స్ 2025లో సమర్పించిన ఈ అధ్యయనం, నిద్రకు సాయం చేసే ఈ 'మెలటోనిన్' వాడకం విషయంలో వైద్యులు, ప్రజలు మరింత జాగ్రత్త వహించాలని సూచిస్తోంది.

 అధ్యయనంలో.. 

దీర్ఘకాలిక నిద్రలేమితో (Chronic Insomnia) బాధపడుతున్న వేల మంది రోగుల ఆరోగ్య రికార్డులను పరిశోధకులు విశ్లేషించారు. ఇందులో, ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం మెలటోనిన్ ఉపయోగించిన వారికి, వాడని వారితో పోలిస్తే గుండె వైఫల్యం వచ్చే అవకాశం దాదాపు 90 శాతం అధికంగా ఉన్నట్లు గుర్తించారు.మెలటోనిన్ తీసుకునే వ్యక్తులు గుండె వైఫల్యం కారణంగా ఆసుపత్రిలో చేరే ప్రమాదం 3.5 రెట్లు ఎక్కువగా ఉందని అధ్యయనం పేర్కొంది.

ఐదేళ్ల కాలంలో, మెలటోనిన్ ఉపయోగించిన వారిలో ఏ కారణం చేతనైనా మరణించే ప్రమాదం, వాడని వారితో పోలిస్తే దాదాపు రెట్టింపు (Twice) ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.

 'సహజం' అంటే సురక్షితం కాదా..?

మెలటోనిన్ అనేది మెదడులోని పీనియల్ గ్రంథి విడుదల చేసే సహజ హార్మోన్ అయినప్పటికీ, సప్లిమెంట్ల రూపంలో తీసుకునేప్పుడు దాని దీర్ఘకాలిక ప్రభావాలపై ఇప్పటివరకు సరైన పరిశోధనలు లేవని నిపుణులు చెబుతున్నారు. ఈ అధ్యయనం "కారణాన్ని" (Causation) నిరూపించనప్పటికీ, ఈ రెండింటి మధ్య "సంబంధాన్ని" (Association) బలంగా చూపిస్తుందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.

 "మెలటోనిన్ చాలా సురక్షితమైనదిగా, 'సహజమైన' పరిష్కారంగా భావిస్తారు. అందుకే, అనేక ఇతర ప్రమాద కారకాలను బ్యాలెన్స్ చేసిన తర్వాత కూడా ఇటువంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల సంకేతాలు కనిపించడం ఆశ్చర్యం కలిగించింది," అని అధ్యయన బృంద సభ్యులు పేర్కొన్నారు.


గుండె వైద్యులు (Cardiologists), నిద్ర నిపుణులు (Sleep Experts) ఈ ఫలితాలపై తక్షణమే భయపడాల్సిన అవసరం లేదని, కానీ జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. మీరు ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలంగా క్రమం తప్పకుండా మెలటోనిన్ వాడుతున్నట్లయితే, గుండె సంబంధిత సమస్యలు లేదా అధిక రక్తపోటు వంటి ప్రమాద కారకాలు ఉన్నట్లయితే వెంటనే మీ వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోండి.

 జెట్ ల్యాగ్ (Jet Lag) లేదా స్వల్పకాలిక నిద్ర సమస్యల కోసం మెలటోనిన్‌ను అప్పుడప్పుడు లేదా తక్కువ మోతాదులో (5 మి.గ్రా కంటే తక్కువ) వాడటం సురక్షితమని నిపుణులు అంటున్నారు. దీర్ఘకాలిక నిద్రలేమికి మెడికేషన్ లేని చికిత్సా విధానాలైన కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ఫర్ ఇన్సోమ్నియా (CBT-I), సరైన నిద్ర పరిశుభ్రత (Sleep Hygiene) వంటి జీవనశైలి మార్పులు ఉత్తమమని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..పనీర్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : heart-attack heart-blocks heart-problems heart-related-problems heart-disease heart-diseases heart-failure sleep-quality sleeping-position sleep sleeping healthy-sleep sleep-disorders sleep-problems heart-care long-term-melatonin-use melatonin-dangers high-dose-melatonin-risks chronic-melatonin-supplementation
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com