సాక్షి లైఫ్ : నెలలు నిండకుండా (Preterm) జన్మించే శిశువుల సంరక్షణలో ఒక విప్లవాత్మక ఆవిష్కరణ జరిగింది. అపరిపక్వ ఊపిరితిత్తులు, అభివృద్ధి చెందని శ్వాస నియంత్రణ వ్యవస్థల కారణంగా శ్వాస తీసుకోవడంలో తరచూ ఇబ్బంది పడే పసికందుల కోసం శాస్త్రవేత్తలు ఒక "ఆటోమేటెడ్ ట్యాక్టైల్ స్టిమ్యులేషన్ డివైజ్ (ATSD)"ను రూపొందించారు. దీనికి 'బ్రీతింగ్ ఆపరేటర్ ఫర్ బేబీ' (Breathing Operator for BaBY - BOBBY) అని నామకరణం చేశారు.
ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ..
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..?
నెలలు నిండని శిశువుల్లో ఊపిరితిత్తుల పనితీరు సరిగా లేకపోవడం వల్ల తరచుగా శ్వాస తీసుకోవడం ఆగిపోతుంది (Apnoea). ఇలాంటప్పుడు నియోనాటల్ నర్సులు వెంటనే పసికందుల చర్మంపై సున్నితంగా రాసి, వారిని శ్వాస తీసుకోవడానికి ప్రేరేపించాలి. అయితే, ఈ మాన్యువల్ పద్ధతి కొన్నిసార్లు ఆలస్యం కావొచ్చు లేదా అంత స్థిరంగా ఉండకపోవచ్చు. దీనివల్ల శిశువులకు మరింత ప్రమాదం పొంచి ఉంటుంది.
'బాబీ' అనే పరికరం ఎలా పనిచేస్తుంది..?
ఈ 'బాబీ' పరికరం.. నర్సులు అందించే మాన్యువల్ ట్యాక్టైల్ స్టిమ్యులేషన్‌ను అనుకరిస్తుంది.
ఇందులో..
ఆటోమేటిక్ ప్రతిస్పందన: శిశువు కార్డియోరెస్పిరేటరీ మానిటర్‌లో శ్వాస ఆగిపోయిందని లేదా హృదయ స్పందన తగ్గిందని అలారం వచ్చిన వెంటనే, ఈ పరికరం తక్షణమే స్పందించి శిశువు చర్మంపై సున్నితమైన ప్రేరణను అందిస్తుంది. ఇది ఆలస్యం లేకుండా, స్థిరమైన, నమ్మదగిన ప్రేరణను అందించడం ద్వారా శిశువు స్వయంగా శ్వాస తీసుకోవడానికి సహాయపడుతుంది. 'బాబీ' రూపకల్పనలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఎలక్ట్రానిక్ భాగాలను శిశువుకు నేరుగా తాకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
నియోనాటల్ కేర్‌కు ప్రయోజనం..
మరణాల రేటు తగ్గుదల: సకాలంలో, నిరంతర శ్వాస సహాయం అందించడం ద్వారా నెలలు నిండని శిశువుల్లో వచ్చే శ్వాస సమస్యలను, తద్వారా మరణాల రేటును తగ్గించే అవకాశం ఉంది. నిరంతరం శిశువు శ్వాసను పర్యవేక్షించి, మాన్యువల్ జోక్యం చేసుకోవాల్సిన అవసరాన్ని 'బాబీ' పరికరం తగ్గిస్తుంది. దీని వల్ల నర్సులు ఇతర అత్యవసర సంరక్షణపై దృష్టి పెట్టడంతోపాటు పనిభారం తగ్గుతుంది.
ఈ వినూత్న పరికరం సురక్షితత్వాన్ని, సమర్థతను పూర్తిగా నిర్ధారించడానికి క్లినికల్ ట్రయల్స్ అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఆవిష్కరణ నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU) లో సరికొత్త మార్పులు తీసుకురాగలదని వైద్యనిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com