ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష: సీజనల్ వ్యాధుల నివారణకు పటిష్ట చర్యలు..!

సాక్షి లైఫ్ : రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణ, నియంత్రణపై తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మే నెల నుంచే రాష్ట్రంలో వర్షాలు మొదలవడం, వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా మే, జూన్ నెలల నుంచే అక్కడక్కడ సీజనల్ వ్యాధులు ప్రారంభమయ్యాయని అధికారులు మంత్రికి వివరించారు.

 ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

 ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

 

గతేడాదితో పోలిస్తే ఈసారి చాలా జిల్లాల్లో డెంగీ కేసులు తక్కువగా నమోదయ్యాయని, అయితే గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రం స్వల్పంగా కేసులు పెరిగాయని తెలిపారు. 19 జిల్లాల్లో పది కంటే తక్కువ కేసులు నమోదవగా, మిగిలిన జిల్లాల్లో పదికంటే ఎక్కువ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. గత ఏడాది కంటే ఈసారి టైఫాయిడ్ కేసులు చాలా తక్కువగా నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు.

మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు.. 

ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. యాంటిలార్వల్ ఆపరేషన్ విస్తరణ: కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలు, గ్రేటర్ హైదరాబాద్‌లో యాంటిలార్వల్ ఆపరేషన్‌ను విస్తృతం చేయాలని సూచించారు.

స్పెషల్ ఆఫీసర్లు నియమించండి: వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉన్న జీహెచ్‌ఎంసీ జోన్లకు ప్రత్యేక అధికారులను (స్పెషల్ ఆఫీసర్లు) నియమించాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు.కలెక్టర్లతో సమీక్ష: సీజనల్ వ్యాధుల నియంత్రణపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించాలని హెల్త్ సెక్రటరీకి మంత్రి సూచించారు.ట్రైబల్ ఏరియాలపై దృష్టి: గిరిజన ప్రాంతాలపై (ట్రైబల్ ఏరియాలు) ఎక్కువగా దృష్టి సారించాలని, ఐటీడీఏ పీవోలతో సమన్వయం చేసుకోవాలని అన్నారు.

ఇంటింటి సర్వే, అవగాహన: క్షేత్రస్థాయిలో పనిచేసే వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేసి, ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల పర్యటన: కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాల్లో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పర్యటించాలని మంత్రి ఆదేశించారు.

ఆసుపత్రులు సిద్ధంగా ఉండాలి: సీజనల్ వ్యాధుల బారిన పడిన రోగులకు చికిత్స అందించేందుకు ఆసుపత్రులలో అవసరమైన అన్ని వసతులతో సిద్ధంగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అన్ని ఆసుపత్రులలో అవసరమైన అన్ని రకాల మందులను (మెడిసిన్‌) అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు: డెంగీ, ప్లేట్‌లెట్స్ పేరిట రోగులను దోచుకుంటున్న ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. వారానికో నివేదిక: సీజనల్ వ్యాధులపై ప్రతి సోమవారం నివేదిక సమర్పించాలని మంత్రి ఆదేశించారు.

 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : women-health kids-health harmful-to-health health-news-updates seasonal-health-issues health-news prevention public-health damodar-rajanarsimha monsoons monsoons-season monsoon-health-care damodarrajanarsimha public-awareness review review-meeting damodar-raj-narasimha
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com