ఒకే రోజులో దేశంలో నమోదైన మూడు హెచ్‌ఎంపీవీ వైరస్ కేసులు..  

షేర్ చేయండి:
ఒకే రోజులో దేశంలో నమోదైన మూడు హెచ్‌ఎంపీవీ వైరస్ కేసులు..  

సాక్షి లైఫ్ : దేశంలో హ్యూమన్ మెటానిమోవైరస్ (హెచ్‌ఎంపీవీ)కేసులు ఒకే రోజులో మూడు నమోదయ్యాయి. ఈరోజు ఉదయం రెండు కేసులు కర్ణాటకలో వెలుగులోకి రాగా, అక్కడి సర్కారు అప్రమత్తమైంది. తాజాగా అహ్మదాబాద్‌లో కూడా హెచ్‌ఎంపీవీ వైరస్ కేసు ఒకటి నమోదైంది. రెండు నెలల శిశువుకు హెచ్‌ఎంపీవీ సోకింది. ఆ చిన్నారికి 15 రోజుల క్రితం ఆరోగ్యం క్షీణించడంతో అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.  

 చైనాను హడలెత్తిస్తున్న హెచ్‌ఎంపీవీ వైరస్ కేసులు ఇప్పుడు భారతదేశంలో కూడా కలకలం రేపుతున్నాయి. అహ్మదాబాద్‌లోని చంఖేడాలోని ఆరెంజ్ హాస్పిటల్‌లో రెండు నెలల పాపకు హెచ్‌ఎంపీవీ వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించగా హెచ్‌ఎంపీవీ వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు డాక్టర్లు తెలిపారు. శిశువు ఆరోగ్యం క్షీణించడంతో 15 రోజుల క్రితం ఆసుపత్రిలో చేర్చారు. అంతేకాదు ఆరోగ్యం విషమించడంతో కొన్ని రోజులు వెంటిలేటర్‌పై ఉంచి కూడా చికిత్స అందించారు.  

ఇది కూడా చదవండి..హెచ్ఎంపివి వైరస్ ఎలా వ్యాపిస్తుంది..?

ఇది కూడా చదవండి..ఊపిరితిత్తులను సంరక్షించే పండ్లు.. తెలుసా..?

ఇది కూడా చదవండి..భారతదేశంపై హెచ్‌ఎంపీవీ వైరస్ 'డబుల్ ఎటాక్'..

 రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్ కుటుంబంలోని రెండు నెలల చిన్నారికి ఈ వైరస్ సోకిందని, అందుకు సంబంధిచి ఓ ప్రైవేట్ ఆస్పత్రి నుంచి నివేదిక అందిందని వైద్యులు వెల్లడిస్తున్నారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రభుత్వ వైద్యుడు భవిన్ సోలంకి నేతృత్వంలోని బృందం విచారణ కోసం బయలుదేరింది. విచారణ అనంతరం సమాచారం ఇవ్వనున్నారు. ఈ విషయంపై తనకు ఇంకా అధికారిక సమాచారం లేదని గుజరాత్ ఆరోగ్య మంత్రి హృషికేష్ పటేల్ తెలిపారు. అఫీషియల్‌గా వివరాలు వచ్చాక దాని గురించి నేను చెప్పగలను" అని అన్నారు.

 

ఇది కూడా చదవండి..స్ట్రోక్ ప్రమాదాన్ని కలిగించే 4 ఆహార పదార్థాలు.. 

ఇది కూడా చదవండి..ఎలాంటి వారిపై షింగిల్స్ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది..? 

ఇది కూడా చదవండి..స్ట్రోక్ కు ప్రధాన కారణాలు..? నివారణ ఎలా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.