నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం.. 

షేర్ చేయండి:
నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం.. 

సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది పొగాకు వినియోగం వల్ల మరణిస్తున్నారు. ఆయా సమస్య నుంచి ప్రజలను కాపాడడానికి ప్రతి సంవత్సరం మే 31న ‘ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ’ నిర్వహిస్తున్నారు. పొగాకు వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు తెలియజేయడం, అవగాహన కల్పించడం దీని ఉద్దేశ్యం. అసలు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ఎప్పటి నుంచి ప్రారంభమైంది..? ఈ  ఏడాది ఏ థీమ్ తో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుతున్నారో తెలుసుకుందాం.. 

 ఇది కూడా చదవండి.. స్మోకింగ్ చేయడంవల్ల కళ్ల పై ఎలాంటి ప్రభావం పడుతుందో మీకు తెలుసా..?  

ప్రజలలో అవగాహన..

ప్రపంచ ఆరోగ్య సంస్థ 1987లోప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. పొగాకు వాడకం వల్ల కలిగే అనారోగ్యసమస్యల గురించి ప్రజలలో అవగాహన పెంచడంలో ఈ రోజు కీలక పాత్ర పోషిస్తుంది. పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, స్ట్రోక్ , శ్వాసకోశ వ్యాధుల వంటి ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే ధూమపానం వంటి సమస్యలు తలెత్తవచ్చు. 

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం 2024 థీమ్.. 

 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం 2024 థీమ్ "పొగాకు ఉత్పత్తుల నుంచి పిల్లలను రక్షించడం". భవిష్యత్తు తరాలను రక్షించడంతోపాటు పొగాకు వినియోగం నిరంతరం తగ్గేలా చూడాలనేదానిపై ప్రధానంగా దృష్టి సారించారు.

 ఇది కూడా చదవండి.. వెరికోస్ వెయిన్స్ ఉన్నవాళ్లు ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? 

 ఇది కూడా చదవండి.. ఇంట్లోకి దోమలు రాకుండా చిట్కాలు.. 


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.