మూడు క్యాన్సర్ మందులపై కస్టమ్ డ్యూటీ రద్దు.. 

షేర్ చేయండి:
మూడు క్యాన్సర్ మందులపై కస్టమ్ డ్యూటీ రద్దు.. 

సాక్షి లైఫ్ : 2024-25 సంవత్సరానికి బడ్జెట్‌ను లోక్‌సభలో సమర్పించిన సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్యాన్సర్ రోగులకు ఉపశమనం కలిగించేందుకు మరో మూడు మందులను కస్టమ్ డ్యూటీ నుంచి పూర్తిగా మినహాయిస్తున్నట్లు ప్రతిపాదించారు. మూడు క్యాన్సర్ మందులపై దిగుమతి పన్ను నుంచి మినహాయించడమే కాకుండా, ఎక్స్-రే ట్యూబ్‌లు , ఫ్లాట్ ప్యానెల్ డిటెక్టర్‌ల ప్రైమరి కస్టమ్ డ్యూటీలో మార్పులను కూడా ఆర్థిక మంత్రి ప్రకటించారు. దేశంలోనే ఎక్స్-రే ట్యూబ్‌లు, ఫ్లాట్ ప్యానెల్ డిటెక్టర్ల తయారీని ప్రోత్సహించడం దీని లక్ష్యం. 

ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి.. కాగ్నిటివ్ డిక్లైన్ సమస్యను ఎలా నిరోధించవచ్చు..?

ఇది కూడా చదవండి.. హెల్త్‌కేర్ బడ్జెట్ 2024 ముఖ్యాంశాలు..

హెల్త్ బడ్జెట్‌ విషయంలో బయోటెక్నాలజీ పరిశోధన, అభివృద్ధికి ఎక్కువ నిధులు కెటాయించారు. ఇందుకోసం  రూ.500 కోట్ల నుంచి రూ.1100 కోట్లకు పెంచారు. అంతేకాకుండా నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ బడ్జెట్‌ను కూడా రూ.65 కోట్ల నుంచి రూ.90 కోట్లకు పెంచారు. కానీ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ కు మాత్రం బడ్జెట్ రూ.200 కోట్లు ప్రకటించారు. 

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

   ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.