కాగ్నిటివ్ డిక్లైన్ సమస్యను ఎలా నిరోధించవచ్చు..?
సాక్షి లైఫ్ : కాగ్నిటివ్ డిక్లైన్ సమస్యను నివారించాలంటే..? కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనస్సును చురుకుగా ఉంచుకోవాలి - పజిల్స్‌ని పరిష్కరించడం, సంగీత వాయిద్యం వాయించడం నేర్చుకోవడం లేదా కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం వంటి వాటిపై దృష్టి సారించడం వల్ల మనస్సును చురుకుగా ఉంచవచ్చు.
ఇది కూడా చదవండి.. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌టెన్షన్ బాధితులు వీళ్లే..
ఇది కూడా చదవండి.. కల్తీ ఆహారాన్ని గుర్తించడం ఎలా..?
వ్యాయామం చేయండి: రోజువారీ వ్యాయామం మెదడుకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతేకాదు ఇది మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందుకోసం వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయడం ఉత్తమమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం: అన్ని రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు ,ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఇలాంటి ఆహారం మెదడుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
సామాజిక సామాజిక సంబంధాలు: సామాజిక సంబంధాలను బలోపేతం చేయడం, సామాజిక కార్యకలాపాలలో పాల్గొనడం చాలా అవసరం. తగినంత నిద్ర : క్రమం తప్పకుండా 7-8 గంటలు నిద్ర తప్పనిసరిగా అవసరం. ఎందుకంటే నిద్ర లేకపోవడం వల్ల మెదడుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించండి.ధూమపానం, మద్యపానం చేయవద్దు: ధూమపానం , మద్యపానం కూడా మెదడుపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. కాబట్టి ఇవి పూర్తిగా మానెయ్యాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
