War Impact : వార్ ఎఫెక్ట్ తో ఏప్రిల్ 1 నుంచి భారీగా పెరగనున్న మందులు, సర్జికల్ వస్తువుల ధరలు..!
సాక్షి లైఫ్ : పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం సామాన్యుడి ఆరోగ్య బడ్జెట్‌ను తలకిందులు చేయనుంది. రవాణా మార్గాల్లో ఆటంకాలు, షిప్పింగ్ ఛార్జీల పెరుగుదల కారణంగా ఏప్రిల్ 1 నుంచి మందులు, శస్త్రచికిత్స పరికరాల ధరలు భారీగా పెరగ నున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ధరల పెరుగుదల అధికంగా ఉండనుందని మందుల సరఫరాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు..
సాధారణంగా ఏటా మందుల ధరలు స్వల్పంగా పెరుగుతుంటాయి. కానీ, ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల వల్ల ఈసారి ధరల వాత గట్టిగానే ఉండబోతోంది. సుమారు 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. సిరంజీలు, ఐవీ సెట్లు, గ్లోవ్స్ వంటి సర్జికల్ వస్తువుల ధరలు 15 నుంచి 25 శాతం మేర పెరగనున్నాయి. గుండె ఆపరేషన్లలో వాడే స్టెంట్ల ధరలు ఇప్పటికే సుమారు 10 శాతం పెరిగినట్లు సమాచారం.
కారణాలేమిటి అంటే..?
పశ్చిమాసియా సంక్షోభం వల్ల వాణిజ్య మార్గాలకు అంతరాయం ఏర్పడింది. దీనివల్ల వస్తువుల దిగుమతి వ్యయం పెరిగిందని మెడికల్ సప్లయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.బి. రామచంద్ర తెలిపారు. ఇప్పటికే పలు కంపెనీల నుంచి ధరల పెంపునకు సంబంధించిన సమాచారం అందినట్లు ఆయన పేర్కొన్నారు.
రోగులపై తీవ్ర ప్రభావం..
ప్రైవేట్ ఆసుపత్రులు ఈ పెరిగిన భారనంతా రోగుల బిల్లుల రూపంలో వారిపైనే వేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల బడ్జెట్ నిర్ణీత కాలానికి ఒకసారి మాత్రమే మారుతుంది. అకస్మాత్తుగా పెరిగిన ఈ ధరల వల్ల ప్రభుత్వ ఆసుపత్రులకు మందుల సరఫరా చేయడం కష్టతరమవుతుందని సరఫరాదారులు చెబుతున్నారు. ప్రభుత్వం ధరలను నియంత్రించే (Controlled Drugs) మందుల ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, డీ-కంట్రోల్డ్ విభాగంలోని మందుల ధరలు కంపెనీల ఇష్టానుసారం పెరగనున్నాయి.
అంతర్జాతీయ యుద్ధ జ్వాలలు మన దేశంలోని సామాన్యుడిని ఆందోళన కలిగిస్తున్నాయి. చికిత్స ఖర్చులు ప్రియం కానుండటంతో మధ్యతరగతి, పేద రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
