భారతదేశంలో ధృవీకరించిన COVID-19 కేసుల సంఖ్య ఎంతంటే..?
సాక్షి లైఫ్ : సింగపూర్, హాంకాంగ్‌లలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంలోని ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమ య్యారు. ప్రస్తుతం దేశంలో కోవిడ్-19 పరిస్థితి అదుపులో ఉంది, కేవలం 257 కేసు లు మాత్రమే నమోదయ్యాయి. ఇన్ఫ్లుఎంజా వంటి కేసులను నిర్మూలించేందుకు ఆసుపత్రులను సిద్ధం చేశారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది.
ఇది కూడా చదవండి..ఫర్ క్వాలిటీ స్లీప్ : ఎలాంటి మార్పుల ద్వారా నాణ్యమైన నిద్ర పొందవచ్చు..?
ఇది కూడా చదవండి..స్లీప్ మాక్సింగ్ ట్రెండ్ ఆరోగ్యానికి ప్రమాదకరమా..?
ఇది కూడా చదవండి..ప్రోటీన్ లోపంవల్ల తలెత్తే 6 అనారోగ్య సమస్యలు..?
భారతదేశంలో కేసుల సంఖ్య 257..
సింగపూర్, హాంకాంగ్‌లలో కోవిడ్ కేసుల పెరుగుదలపై భారత ఆరోగ్యశాఖ అధికారులు నిఘా ఉంచారు. అయితే, దేశంలో కరోనా వైరస్‌కు సంబంధించిన ప్రస్తుత పరిస్థితి అదుపులో ఉందని అధికారులు చెబుతున్నారు.
సోమవారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ డిపార్ట్‌మెంట్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ,కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులోని వైద్య నిపుణులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
భారతదేశంలో కేవలం..
మే 19 వరకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, భారతదేశంలో ప్రస్తుతం ధృవీకరించిన COVID-19 కేసుల సంఖ్య 257, ఇది దేశంలోని జనాభాను పరిగణనలోకి తీసుకుంటే చాలా తక్కువ. ఈ కేసులన్నీ దాదాపు తక్కువేనని, వీటికి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని వర్గాలు తెలిపాయి. ఇన్ఫ్లుఎంజా లాంటి అనారోగ్యాలు, తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కేసులను పర్యవేక్షించాలని ఆసుపత్రులను కోరారు.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించడంలో ప్రజారోగ్యాన్ని పరిరక్షించడానికి తగిన చర్యలు తీసుకునే విషయంలో అప్రమత్తంగా ఉంది. ఆసియాలోని అనేక ప్రాంతాలలో COVID-19 న్యూ వేవ్ మొదలైంది.
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..పచ్చకామెర్లు ప్రాణాలకు ప్రమాదమా..?
ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు కనిపించే 5 లక్షణాలు..
ఇది కూడా చదవండి..కాలేయంలోని వ్యర్థాలను ఎలా తొలగించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
