Free HPV Vaccination : తెలంగాణరాష్ట్రంలో టీనేజ్ గర్ల్స్ కు 'ఫ్రీగా హెచ్‌పీవీ' వ్యాక్సిన్ ఎప్పటి నుంచి అంటే..?

షేర్ చేయండి:
Free HPV Vaccination : తెలంగాణరాష్ట్రంలో టీనేజ్ గర్ల్స్ కు 'ఫ్రీగా హెచ్‌పీవీ' వ్యాక్సిన్ ఎప్పటి నుంచి అంటే..?

సాక్షి లైఫ్ : తెలంగాణరాష్ట్రంలో పెరుగుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer) కేసులను అడ్డుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 14 ఏళ్ల వయసు నుంచి 15 ఏళ్ల వయస్సు గల అమ్మాయిలకు ఉచితంగా 'హ్యూమన్ పాపిల్లోమా వైరస్' (HPV) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో ఈ టీకాలను అందించనున్నారు.

 ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..  

ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..? 

ఇది కూడా చదవండి.. 30 ఏళ్ల తర్వాత శరీరానికి కొల్లాజెన్ ఎందుకు ముఖ్యమంటే..?

 

 రూ.4,000 వ్యాక్సిన్ ఉచితంగా.. 

 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో ఈ టీకాలను అందించనున్నారు. ఫిబ్రవరి చివరలో లేదా మార్చి మొదటి వారంలో ఈ పంపిణీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఉచితంగా  ప్రైవేట్ రంగంలో ఒక్కో డోసు సుమారు రూ.2,000 నుంచి రూ.4,000 వరకు ఉండగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో దీనిని ఉచితంగా అందజేస్తారు. ప్రభుత్వం ఇప్పటికే 4.6 లక్షల డోసుల 'గార్డసిల్ 4' వ్యాక్సిన్‌ను సేకరించింది. ఇది క్యాన్సర్‌కు కారణమయ్యే హెచ్‌పీవీ 6, 11, 16 ,18 రకాల వైరస్‌ల నుంచి రక్షణ కల్పిస్తుంది.

పెరుగుతున్న మరణాల సంఖ్య..

తెలంగాణలో గర్భాశయ క్యాన్సర్ కేసుల సంఖ్య 2021లో 3,169 ఉండగా, 2025 నాటికి అది 3,233కు పెరిగింది. అదేవిధంగా మరణాల సంఖ్య కూడా 1,711 నుంచి 1,746కు చేరడం ఆందోళన కలిగిస్తోంది. పెళ్లికి ముందే, అంటే హెచ్ పీవీ వైరస్ సంక్రమించక ముందే టీకా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పును సమర్థవంతంగా అడ్డుకోవచ్చని గైనకాలజిస్టులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..? 

ఇది కూడా చదవండి.. ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?

 ఇది కూడా చదవండి.. శరీరంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ ఎంత ఉండాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.