World Kidney Day 2026 : మూత్రపిండాల ఆరోగ్యం విషయంలో చికిత్సతో పాటు పర్యావరణ స్పృహ అవసరమే..!

షేర్ చేయండి:
World Kidney Day 2026 : మూత్రపిండాల ఆరోగ్యం విషయంలో చికిత్సతో పాటు పర్యావరణ స్పృహ అవసరమే..!

సాక్షి లైఫ్ : మన శరీరంలో ప్రధాన అవయవాలలో కిడ్నీలు కూడా ఒకటి. మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న కాలుష్యం కారణంగా మానవ శరీరంలో అత్యంత కీలకమైన మూత్రపిండాలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. కిడ్నీల ఆరోగ్యం కేవలం మందులు, వైద్య చికిత్సలపైనే కాకుండా మన చుట్టూ ఉన్న పర్యావరణ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్య సహాయం, పర్యావరణ కారకాల మధ్య సమతుల్యత పాటించడం ద్వారానే మూత్రపిండాల వ్యాధులను సమర్థవంతంగా అడ్డుకోవచ్చని వారు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

 

కాలుష్య కోరల్లో కిడ్నీలు.. 

గాలిలోని సూక్ష్మ ధూళి కణాలు (PM 2.5) శ్వాస ద్వారా రక్తంలోకి చేరి, చివరికి కిడ్నీల పనితీరును దెబ్బతీస్తాయని పలు అధ్యయనాలు నిరూపించాయి. పారిశ్రామిక వ్యర్థాలు కలిసిన నీటిని తాగడం వల్ల కూడా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటం, క్రానిక్ కిడ్నీ డిసీజ్ (CKD) వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కేవలం ఆసుపత్రులకు వెళ్లడమే కాకుండా, మనం నివసించే పరిసరాలను పచ్చదనంతో నింపుకోవడం, స్వచ్ఛమైన గాలిని పీల్చడం కిడ్నీల ఆరోగ్యానికి ఎంతో అవసరం.

వైద్య పర్యవేక్షణ-జాగ్రత్తలు.. 

మధుమేహం, రక్తపోటు ఉన్నవారు క్రమం తప్పకుండా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుల సలహా లేకుండా నొప్పి నివారణ మందులు (Painkillers) వాడటం కిడ్నీలకు అత్యంత ప్రమాదకరం. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి కిడ్నీలకు తగినంత నీరు అవసరం. అయితే, పర్యావరణంలోని మార్పుల వల్ల ఎండలు పెరిగినప్పుడు శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆరోగ్యకరమైన కిడ్నీల కోసం ఏమేం చేయాలి..? 

రోజుకు కనీసం 3-4 లీటర్ల శుభ్రమైన నీటిని తాగాలి. ఆహార నియమాలు పాటించాలి. ఉప్పు, కృత్రిమ రంగులు కలిపిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చు. ప్లాస్టిక్ బాటిళ్లలో నిల్వ ఉంచిన నీటి కంటే సహజమైన మట్టి పాత్రల నీటికి ప్రాధాన్యత ఇవ్వాలి.

 

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.