World Malaria day 2026 : మలేరియాతోపాటు డెంగ్యూ, టైఫాయిడ్ అటాక్..! హెచ్చరిస్తున్న వైద్యనిపుణులు
సాక్షి లైఫ్ : జ్వరం వచ్చిందంటే చాలు.. అది మలేరియానే అని భ్రమపడొద్దు. ప్రస్తుత రోజుల్లో మలేరియా ఒంటరిగా రావడం లేదు. తనతో పాటు డెంగ్యూ, టైఫాయిడ్ వంటి ఇతర ఇన్ఫెక్షన్లను కూడా తోడు తెచ్చుకుంటోంది. ఈ 'ద్వంద్వ సంక్రమణ' (Co-infection) ఇప్పుడు వైద్య లోకాన్ని విస్మయానికి గురిచేస్తోంది. సరైన సమయంలో ఈ బహుళ ఇన్ఫెక్షన్లను గుర్తించకపోతే చికిత్స ఫలించక ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
కలవరపెడుతున్న అధ్యయనం..
ఢిల్లీలోని వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజీ, సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి వైద్యులు జూలై 2022 నుంచి నవంబర్ 2023 మధ్య కాలంలో జ్వరంతో బాధపడుతున్న 4,259 మంది రోగులపై లోతైన అధ్యయనం చేశారు. ఇందులో తేలిన నిజాలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి.
పరీక్షలు నిర్వహించిన వారిలో 87 మంది అంటే 2.04శాతం మలేరియా బారిన పడ్డారు. మలేరియా సోకిన రోగుల్లో దాదాపు 45 శాతం మందికి డెంగ్యూ, చికున్‌గున్యా లేదా టైఫాయిడ్ వంటి ఇతర వ్యాధులు కూడా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.వీరిలో ప్లాస్మోడియం వైవాక్స్ ,ఫాల్సిపరం అనే రెండు రకాల మలేరియా ఇన్ఫెక్షన్లు వెలుగు చూశాయి.
లక్షణాల గుర్తింపు కష్టమే..!
సాధారణంగా జ్వరం రాగానే ప్రామాణిక మలేరియా చికిత్స తీసుకుంటారు. కానీ ఒకటి కంటే ఎక్కువ వ్యాధులు ఉన్నప్పుడు రోగ నిర్ధారణ క్లిష్టంగా మారుతుంది. అధ్యయనం ప్రకారం రోగుల్లో ప్రధానంగాపలురకాల లక్షణాలు కనిపిస్తున్నాయి.
చలితో కూడిన జ్వరం: 80.46శాతం
కాలేయం, ప్లీహం వాపు: 64.37శాతం
కండరాలు, ఒళ్ళు నొప్పులు: 55శాతం పైగా
కామెర్లు: 51.72శాతం
తీవ్ర రక్తహీనత కొన్ని కేసుల్లో ప్రాణాపాయ స్థితికి దారితీస్తోంది. ఢిల్లీ వంటి జనసాంద్రత ఉన్న నగరాల్లో మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా అన్నీ దోమల ద్వారానే వ్యాపిస్తాయి. మరోవైపు కలుషిత నీటి వల్ల టైఫాయిడ్ వస్తుంది. ఈ మూడింటినీ వేరు చేసి గుర్తించడం వైద్యపరంగా ఒక సవాలుగా మారిందని ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ నీరజ్ నిశ్చల్ చెబుతున్నారు.
ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంటే..?
మలేరియా ఇతర ఇన్ఫెక్షన్లతో కలిసినప్పుడు రోగ నిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా జూలై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ ముప్పు ఎక్కువగా ఉంటుంది. మహిళల కంటే పురుషులకే ఈ ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం అధికంగా ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది.
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
ఇది కూడా చదవండి..Rainy Season : వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని కూరగాయలు
ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి...బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
