World Mosquito Day : దోమకాటుతో పొంచి ఉన్న ప్రాణాంతక వ్యాధులు..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వర్షాకాలం రాగానే వాతావరణం చల్లబడటంతో పాటు దోమల బెడద కూడా విపరీతంగా పెరుగుతుంది. చూడటానికి ఎంతో చిన్నగా కనిపించే దోమ.. మన ప్రాణాలను సైతం తీయగల ప్రమాదకరమైన వ్యాధులకు కారణమవుతుంది. దోమల వల్ల వచ్చే వ్యాధులు, వాటి లక్షణాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 20న 'ప్రపంచ దోమల దినోత్సవం' (World Mosquito Day) జరుపుకుంటారు. ఈ సందర్భంగా సాక్షి లైఫ్ ప్రత్యేక కథనం.. వివిధ జాతులకు చెందిన దోమలు కుట్టడం వల్ల ముఖ్యంగా 5 రకాల ప్రాణాంతక వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది.

 

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

డెంగీ జ్వరం (Dengue)..

ఇన్ఫెక్షన్ ఉన్న ఏడిస్ దోమ కుట్టడం వల్ల ఇది వస్తుంది. హఠాత్తుగా తీవ్రమైన జ్వరం, కళ్ల వెనుక భాగంలో నొప్పి, కీళ్ల నొప్పులు, చర్మంపై దద్దుర్లు వస్తాయి. పరిస్థితి విషమిస్తే చిగుళ్లు లేదా ముక్కు నుంచి రక్తం కారడం, తీవ్రమైన కడుపునొప్పి రావచ్చు.

మలేరియా (Malaria).. 

వ్యాధిగ్రస్థమైన ఆడ అనాఫిలిస్ దోమల ద్వారా ఇది వ్యాపిస్తుంది. చలితో కూడిన జ్వరం, విపరీతమైన వణుకు, ఆ తర్వాత తీవ్రంగా చెమటలు పట్టి జ్వరం తగ్గడం, నీరసం రావడం దీని ప్రధాన లక్షణాలు.

చికెన్‌గున్యా (Chikungunya)..

 ఇది కూడా ఏడిస్ దోమల వల్లే వస్తుంది. నడవలేనంత తీవ్రమైన కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, అలసట బాధిస్తాయి. జ్వరం తగ్గాక కూడా ఈ కీళ్ల నొప్పులు చాలాకాలం పాటు వేధిస్తుంటాయి.

జికా వైరస్ (Zika Virus)..

దీనివల్ల స్వల్ప జ్వరం, కళ్లు ఎర్రబడటం వంటి తేలికపాటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే, గర్భిణులకు ఇది అత్యంత ప్రమాదకరం. గర్భస్థ శిశువు ఎదుగుదల, ముఖ్యంగా మెదడుపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. జపనీస్ ఎన్సెఫలైటిస్.. దోమల ద్వారా వ్యాపించే ఈ తీవ్రమైన వైరస్ నేరుగా మెదడుపై దాడి చేస్తుంది. మూర్ఛ, మెడ బిగుసుకుపోవడం, స్పృహ కోల్పోవడం జరుగుతుంది. పిల్లల్లో ఈ ముప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి తగిన వ్యాక్సిన్ (vaccine) వేయించడం ఉత్తమం.

తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు..

ఇంటి పరిసరాల్లో, పాత టైర్లు, పూలకుండీలు, కొబ్బరి చిప్పల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నిద్రపోయేటప్పుడు తప్పనిసరిగా దోమ తెరలు లేదా మస్కిటో రిపెల్లెంట్స్ ఉపయో గించాలి.

 

ఇది కూడా చదవండి..Dance to Burn Calories : డ్యాన్స్‌తో క్యాలరీలు బర్న్ : రోజూ 30 నిమిషాల డ్యాన్స్‌తో ఫిట్‌నెస్ మీ సొంతం..! 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?  

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.