కాల్షియం అధికంగా ఉండే పండ్లు ఇవిగో..  

సాక్షి లైఫ్ : ఎముకలు, దంతాల పటిష్టతకు ఆహారంలో కాల్షియం ఉండటం చాలా ముఖ్యం. నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్, డైరీ ప్రొడక్ట్స్ లో క్యాల్షియం అధిక మొత్తంలో లభిస్తుంది. కానీ శాఖాహారులు దీనిని తినలేరు. అలాంటి వారి కోసం ఈరోజు మనం క్యాల్షియం పుష్కలంగా ఉండే అటువంటి పండ్లను గురించి తెలుసుకుందాం.. 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
 
కాల్షియం అనేది ఎముకల ఆరోగ్యాన్ని, బలాన్ని కాపాడుకోవడంలో సహాయపడే ఒక ఖనిజం. కాల్షియం పాల ఉత్పత్తులు, గుడ్లలో (కాల్షియం రిచ్ ఫ్రూట్స్) సమృద్ధిగా లభిస్తుంది. కానీ, శాకాహారిగా ఉండే వ్యక్తులకు, డైరీ ప్రోడక్ట్స్ ,గుడ్లను వారి ఆహారంలో చేర్చకుండా రోజుకు 1,000 mg రోజువారీ కాల్షియం అవసరాలను తీర్చడం కష్టం. అలాంటి వారు వీటిని రోజూ తింటే శరీరంలో కాల్షియం లోపం తలెత్తదు.

  కాల్షియం పుష్కలంగా ఉండే పండ్లు.. 
 
కాల్షియం పుష్కలంగా ఉండే పండ్లలో ఆరెంజ్ మొదటిది. వీటిలో ప్రతి 100 గ్రాములలో 45 నుంచి 50 mg కాల్షియం, విటమిన్లు ఉంటాయి. అంతేకాదు ఈ పండ్లలో ఫైబర్‌,యాంటీఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉంటాయి.

ఆప్రికాట్

ఆప్రికాట్ కాల్షియం ఉత్తమ మూలం. ఎండిన ఆప్రికాట్లు మంచి రుచిగా ఉండడమేకాకుండా ఆరోగ్యకరమైనవి కూడా. ప్రతి 100 గ్రాముల ఆప్రికాట్‌లో సాధారణంగా 15 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది.

ఎండిన అత్తి పండ్లు (అంజీర పండ్లు)

ఈ పండ్లలో క్యాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ఇవి ఎముకలు,దంతాలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన కాల్షియంను అందిస్తాయి.  

కివి పండ్లు.. 

కివి ఒక రుచికరమైన పండు. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.  శరీరానికి మేలు చేసే ఇతర ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి. అన్ని వయసుల వారు కివి పండుని తింటారు. కివిని స్మూతీ, జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. ప్రతి 100 గ్రాముల కివిలో 30 mg కాల్షియం ఉంటుంది.

స్ట్రాబెర్రీ.. 

 స్ట్రాబెర్రీలలో వివిధ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాములలో 16 mg కాల్షియం ఉంటుంది. స్ట్రాబెర్రీలు రోగనిరోధక శక్తిని పెంచడంలో ,దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. వీటిని మీ డైట్‌లో స్మూతీస్, జ్యూస్‌లు, డెజర్ట్‌ల రూపంలో చేర్చుకోవచ్చు.

అరటిపండ్లు

కాల్షియం అధికంగా ఉండే పండ్లలో అరటిపండు ఒకటి. ఒక కప్పు తరిగిన అరటిపండు సుమారు 8 మిల్లీగ్రాముల కాల్షియంను అందిస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలకు సరైన పరిష్కారం ఇది. రోగనిరోధక శక్తిని మెరుగుపరచడం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం, గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుంది.

 ఇది కూడా చదవండి.. రాత్రి భోజనం తర్వాత నడిస్తే.. ప్రయోజనాలివే.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : bone-health calcium teeth-health calcium-rich-fruits calcium-fruits-list apricot figs strawberry banana

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com