నల్ల ద్రాక్షతో ఆరోగ్య ప్రయోజనాలు..  

సాక్షి లైఫ్ : నల్ల ద్రాక్షలో ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉన్నాయి. వీటిని తినడం వల్ల అనేక వ్యాధులు నయం అవుతాయి. అంతే కాదు వీటిలో ఉండే మినరల్స్ , విటమిన్స్ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. రోజూ నల్ల ద్రాక్ష తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు. నల్ల ద్రాక్ష తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

నల్ల ద్రాక్ష తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.అధిక బరువును తగ్గించడంలో ఇందులో ఉండే ఫైబర్ కీలక పాత్ర పోషిస్తుంది. నల్ల ద్రాక్షలో ఉండే విటమిన్ "సి" చర్మ సంరక్షణలో ఉపకరిస్తుంది. బ్లాక్ గ్రేప్స్ లో శరీరానికి కావలసిన రోగనిరోధక శక్తిని అందించే పోషకాలున్నాయి. కాబట్టి పలురకాల వ్యాధులు రాకుండా ఉండేందుకు పోరాడడంలో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. 

రక్తపోటు నియంత్రణకు.. 

రక్తపోటును అదుపులో ఉంచుతుంది. నల్ల ద్రాక్షలో తగినంత మొత్తంలో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని,మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడతాయి. అలాగే, ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఎలాంటి ఇన్ఫెక్షన్‌తోనైనా పోరాడతాయి.

బరువు తగ్గడంలో.. 

నల్ల ద్రాక్షలో తక్కువ కేలరీలు ఉంటాయి. ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది, ఇది ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచడంలో సహాయపడుతుంది. తద్వారా బరువు నియంత్రణలో  కీలక పాత్ర పోషిస్తుంది.

గుండెకు..  

నల్ల ద్రాక్షలో ఉండే పోషకాలు గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కార్డియో వాస్కులర్ వ్యాధులను నివారించడంలో ఉపయోగపడుతాయి. తద్వారా గుండె ఆరోగ్యం కాపాడుకోవచ్చు. 

ఇది కూడా చదవండి.. New study : మీ బెడ్ రూమ్ ఎంత సేఫ్ ..? పిల్లో కవర్‌లో మిలియన్ల కొద్దీ బ్యాక్టీరియాలు..  


జీర్ణవ్యవస్థ.. 

నల్లద్రాక్ష జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలుచేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్    జీర్ణక్రియకు చాలా ముఖ్యమైనది. ఇది మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది, అజీర్తిని కూడా నివారిస్తుంది. 

రోగనిరోధక శక్తి.. 

నల్ల ద్రాక్షలో విటమిన్ సి,ఇతర యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి శరీరానికి వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి.

చర్మం, జుట్టు ఆరోగ్యం.. 

నల్ల ద్రాక్షలో విటమిన్ "సి"తోపాటు ఇతర పోషకాలు ఉన్నాయి. ఇవి చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. 

క్యాన్సర్ పై పోరాడే.. 

నల్ల ద్రాక్షలో ఉండే రెస్వెరాట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ కారణంగా క్యాన్సర్ పెరుగుదల నెమ్మదిస్తుంది. నల్ల ద్రాక్షను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కణాలకు నష్టం జరగదు.

హైడ్రేట్.. 

నల్ల ద్రాక్షలో ఎక్కువ మొత్తంలో నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. దీంతో డీహైడ్రేట్ సమస్య నుంచి బయట పడొచ్చు. 

కళ్లకు మేలు.. 

నల్ల ద్రాక్షలో ఉండే ముఖ్యమైన పోషకాలు కంటి చూపును మెరుగుపరుస్తాయి. అంతేకాదు బ్లాక్ గ్రేప్స్ ను రోజూ తినడంవల్ల క్యాటరాక్ట్‌ సమస్య ను నివారించవచ్చు. 

ఇది కూడా చదవండి.. మంచి పుచ్చకాయను ఎలా గుర్తించాలి..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : hair-loss health-care-tips healthy-food heart-health weight-loss immune-system vitamins health-tips black-grapes grapes

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com