Ebola Virus Scare : ఎబోలా వైరస్ కలకలం: అప్రమత్తమైన భారత ప్రభుత్వం.. ఎయిర్‌పోర్టుల్లో ప్రత్యేక స్క్రీనింగ్.. హెల్త్ అడ్వైజరీ జారీ..
సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో వణికిస్తోన్న ప్రాణాంతక 'ఎబోలా వైరస్' పట్ల భారత ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తమైంది. ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో పాటు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) తాజాగా దేశవ్యాప్తంగా హెల్త్ అడ్వైజరీ కీలకమైన ఆరోగ్య హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఉంచాలని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఆ దేశాల నుంచి వచ్చేవారు జాగ్రత్త..!
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC), ఉగాండా, దక్షిణ సూడాన్ వంటి అత్యధిక ప్రమాదం ఉన్న దేశాల నుంచి భారతదేశానికి వచ్చే లేదా ఆయా దేశాల మీదుగా ప్రయాణించి ఇక్కడికి చేరుకునే వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కేంద్రం ఆదేశించింది. దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు, పోర్టులు, ఆరోగ్య సంస్థలు అప్రమత్తంగా ఉండాలని.. సదరు ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే ప్రత్యేక స్క్రీనింగ్ విధానాలను అమలు చేయాలని స్పష్టం చేసింది.
గాలి ద్వారా వ్యాపించదు.. కానీ..!
ఎబోలా అనేది అత్యంత తీవ్రమైన, ప్రాణాంతకమైన వైరల్ ఇన్ఫెక్షన్. ఇది గాలి ద్వారా వ్యాపించదు. అయితే, ఈ వ్యాధి సోకిన రోగి శరీర ద్రవాలు అంటే రక్తం, చెమట, లాలాజలం, వాంతులు, మలం వంటివి తాకితే ఇతరులకు వేగంగా సంక్రమిస్తుంది. అందువల్ల బాధితులకు సేవలు అందించే ఆరోగ్య సిబ్బంది, కుటుంబ సభ్యులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తొలి దశలో సాధారణ జ్వరంలాగే..
ఎబోలా వైరస్ సోకిన తర్వాత ప్రాథమికంగా కనిపించే లక్షణాలు సాధారణ జ్వరాన్ని పోలి ఉంటాయి. అందువల్ల ప్రజలు దీనిని గుర్తించడంలో పొరపాటు పడే ప్రమాదం ఉంది.
ప్రధాన లక్షణాలు ఎలా ఉంటాయంటే..?
తీవ్రమైన జ్వరం, విపరీతమైన అలసట, బలహీనత
తలనొప్పి, కండరాల నొప్పులు, గొంతు నొప్పి
వ్యాధి ముదిరితే వాంతులు, విరేచనాలు కావడం
తీవ్రమైన పరిస్థితుల్లో ముక్కు, చిగుళ్లు లేదా అంతర్గత అవయవాల నుంచి అసాధారణంగా రక్తస్రావం కావడం.
ఆ 21 రోజులు అత్యంత కీలకం..!
ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రయాణించి వచ్చిన వారు.. తదుపరి 21 రోజులలోపు ఎబోలావైరస్ కు సంబంధించిన ఏ ఒక్క లక్షణాన్ని గమనించినా తక్షణమే వైద్యులను సంప్రదించాలి. తమ ట్రావెల్ హిస్టరీ దాచకుండా వైద్యులకు వివరించడం వల్ల సకాలంలో రోగ నిర్ధారణ జరిగి ప్రాణాపాయం తప్పుతుంది.
ఐసోలేషన్.. సకాలంలో చికిత్సే రక్షణ..!
ఎబోలా బారిన పడిన రోగులకు సకాలంలో చికిత్స అందకపోతే శరీరంలోని పలు ముఖ్య అవయవాలు విఫలమై మరణానికి దారితీసే ముప్పు చాలా ఎక్కువ. అయితే, లక్షణాలను ముందుగానే గుర్తించి, రోగిని ఇతరుల నుంచి వేరుచేసి, తగిన వైద్య సహాయం అందించడం ద్వారా ఈ మహమ్మారి నుంచి ప్రాణాలు కాపాడవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ భరోసా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు స్వచ్ఛందంగా ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని కోరింది.
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
