Hantavirus : షిప్పింగ్ టూర్లలో హంటా వైరస్ కలకలం.. ముగ్గురు మృతి..!

సాక్షి లైఫ్ : సముద్ర ప్రయాణంలో విహరిస్తున్న పర్యాటకులను అంతుచిక్కని వైరస్ వణికిస్తోంది. అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న ఒక నెదర్లాండ్స్ క్రూయిజ్ షిప్‌లో 'హంటా వైరస్' కలకలం రేగింది. ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడి ఇప్పటికే ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.  

 

ఇది కూడా చదవండి..ప్రతిరోజూ 30 నిమిషాలు నడవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..బ్లాక్ కాఫీ మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

 

అసలేం జరిగింది..?

అర్జెంటీనా నుంచి బయలుదేరిన 'ఎంవీ హోండియస్' అనే నౌకలో సుమారు 150 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణం మధ్యలో కొందరు పర్యాటకులు తీవ్రమైన జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నెదర్లాండ్స్‌కు చెందిన దంపతులతో పాటు ఒక జర్మనీ దేశస్థుడు మృతి చెందారు. ప్రస్తుతం ఈ నౌకను పశ్చిమ ఆఫ్రికా తీరంలోని కేప్ వెర్డే సమీపంలో నిలిపివేశారు.

అసలు ఏమిటీ హంటా వైరస్..?

హంటా వైరస్ అనేది ప్రధానంగా ఎలుకల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఎలుకల మలమూత్రాలు, లాలాజలం ద్వారా ఈ వైరస్ గాలిలో కలిసే ప్రమాదం ఉంది.  లక్షణాలు: తీవ్రమైన జ్వరం, కండరాల నొప్పులు, అలసట, తలనొప్పి. 

 వ్యాధి ముదిరితే ఊపిరితిత్తుల్లో నీరు చేరి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది (HPS). దీనివల్ల మరణించే అవకాశం 40 శాతం వరకు ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అప్రమత్తంఈ ఘటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందిస్తూ.. నౌకలో ఉన్నవారికి వైద్య సహాయం అందిస్తున్నట్లు తెలిపింది. ఒక ప్రయాణికుడికి హంటా వైరస్ సోకినట్లు ల్యాబ్ పరీక్షల్లో నిర్ధారణ అయింది. మిగిలిన బాధితుల నమూనాలను కూడా సేకరించి విశ్లేషిస్తున్నారు. సాధారణంగా ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాపించదని, అయితే కొన్ని అరుదైన సందర్భాల్లో ఇలా జరిగే అవకాశం ఉందని నిపుణులు అనుమానిస్తున్నారు.  

నివారణ మార్గాలు ఏమిటి..?

ప్రస్తుతం విదేశీ ప్రయాణాలు చేసే వారు, ముఖ్యంగా పాత భవనాలు లేదా ఎలుకలు ఉండే ప్రాంతాల్లో తిరిగే వారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎలుకల ఆవాసాలకు దూరంగా ఉండాలి.ఆహార పదార్థాలపై ఎలుకలు చేరకుండా జాగ్రత్త వహించాలి.నిల్వ ఉన్న ప్రాంతాలను శుభ్రం చేసేటప్పుడు మాస్కులు, గ్లౌజులు తప్పనిసరిగా ధరించాలి. క్రూయిజ్ షిప్‌లో బయటపడిన ఈ వైరస్ మరిన్ని దేశాలకు విస్తరించకుండా అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు కఠిన చర్యలు చేపడుతున్నాయి. బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రుల వద్ద గట్టి నిఘా ఉంచారు.

 

ఇది కూడా చదవండి..ఒత్తిడిని నివారించాలంటే ఎంత సమయం నడవాలి..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : new-virus health-alert hantavirus hantavirus-symptoms hantavirus-outbreak
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com