సాక్షి లైఫ్ : ఆరోగ్యం కోసం వాడే 'డైటరీ సప్లిమెంట్ల' విషయంలో అమెరికాలో కీలక చర్చ మొదలైంది. ప్రస్తుతం మార్కెట్లో ట్రెండీగా మారిన పెప్టైడ్స్ (Peptides), ప్రోబయోటిక్స్ వంటి కొత్త రకం పదార్థాలను సప్లిమెంట్ల జాబితాలో చేర్చాలని తయారీదారులు పట్టుబడుతున్నారు. ఈ మేరకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA) నిబంధనలను సడలించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
నిబంధనల అడ్డంకి ఏమిటి..?
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. మనం తీసుకునే ఆహారం, విటమిన్లు, మూలికలు లేదా ఇతర సహజ వనరుల నుంచి వచ్చే పదార్థాలను మాత్రమే 'డైటరీ సప్లిమెంట్లు'గా పరిగణిస్తారు. కానీ, ఇటీవల సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు ప్రచారం చేస్తున్న పెప్టైడ్స్ వంటివి చాలా వరకు ఆహార పదార్థాల నుంచి వచ్చినవి కావు. ఇవి అమైనో యాసిడ్ల గొలుసుకట్టు వంటివి. కండరాల పెరుగుదలకు, యవ్వనంగా కనిపించడానికి ఇవి దోహదపడతాయని ప్రచారం జరుగుతున్న ప్పటికీ, వీటికి శాస్త్రీయ ఆధారాలు తక్కువని వైద్యనిపుణులు చెబుతున్నారు.
గతేడాది ఆరోగ్య శాఖలో కీలక బాధ్యతలు చేపట్టిన రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్, సప్లిమెంట్ల తయారీదారులకు మద్దతుగా నిలుస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. "అమెరికాను ఆరోగ్యవంతంగా మారుద్దాం" అనే నినాదంతో ఆయన పెప్టైడ్స్, ఇతర హెల్త్ ఉత్పత్తులపై ఉన్న ఆంక్షలను తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఎఫ్‌డీఏలో ఉన్న 'రెడ్ టేపిజం'ను తగ్గించి, పరిశ్రమకు అయ్యే ఖర్చులను తగ్గిస్తామని ఉన్నతాధికారులు కూడా పేర్కొంటున్నారు.
వినియోగదారుల ఆందోళన..
మరోవైపు, ఈ ప్రతిపాదనలపై వినియోగదారుల హక్కుల విభాగం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సప్లిమెంట్ల మార్కెట్‌ను పర్యవేక్షించడమే ప్రస్తుతం ఎఫ్‌డీఏకు కష్టంగా ఉంది. ఇలాంటి సమయంలో కొత్త కెమికల్స్, పదార్థాలకు అనుమతిస్తే ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందని 'సెంటర్ ఫర్ సైన్స్ ఇన్ ద పబ్లిక్ ఇంటరెస్ట్' (CSPI) హెచ్చరించింది.
ప్రస్తుతం ఇంజెక్షన్ల రూపంలో, పౌడర్ల రూపంలో లభిస్తున్న పెప్టైడ్స్ వల్ల కలిగే లాభాల కంటే.. వాటి వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఎఫ్‌డీఏ ఒకవేళ ఈ నిబంధనలను సడలిస్తే, మార్కెట్లోకి రకరకాల 'వెల్నెస్' ఉత్పత్తులు వెల్లువలా వచ్చే అవకాశం ఉంది. అయితే, వీటిని వాడే ముందు వైద్యుల సలహా తీసుకోవడం అత్యంత ఆవశ్యకం. ఆరోగ్య రక్షణలో సప్లిమెంట్లు కీలకమైనప్పటికీ, నియంత్రణ లేని పదార్థాలు వికటించే ప్రమాదం ఉంది. అందుకే, చట్టపరమైన మార్పులు ప్రజారోగ్యానికి మేలు చేస్తాయా లేదా అన్నది వేచి చూడాలి.
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com