సాక్షి లైఫ్ : మెడికల్ షాపుల్లో విక్రయాలను క్రమబద్ధీకరించేందుకు, ముఖ్యంగా యువత మత్తు మందులకు బానిస కాకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని మెడికల్ షాపుల్లో సిసిటివి (CCTV) కెమెరాల ఏర్పాటును తప్పనిసరి చేస్తూ నిబంధనలు సవరించనుంది. ఇప్పటివరకు ఇది స్వచ్ఛందంగా ఉన్నప్పటికీ, త్వరలోనే అన్ని రీటైల్ ఫార్మసీలకు ఇది చట్టపరమైన నిబంధనగా మారనుంది.
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
మత్తు మందుల దుర్వినియోగం నిరోధం..
టీనేజర్లు, మైనర్లు అలవాటుగా మారే ప్రమాదకరమైన మందులను (Habit-forming drugs) సులభంగా పొందుతున్నట్లు గుర్తించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ సవరణ..జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సంయుక్తంగా ఈ అడుగు వేశాయి. షెడ్యూల్ హెచ్ (H), హెచ్1 (H1), ఎక్స్ (X) కేటగిరీకి చెందిన శక్తివంతమైన యాంటీబయాటిక్స్, సైకోట్రోపిక్ పదార్థాల అక్రమ విక్రయాలపై నిఘా పెట్టడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.
కెమెరాలు ఎక్కడ ఉండాలి..?
కేవలం షాపు ముందు భాగమే కాకుండా.. ఫార్మసిస్ట్ ప్రిస్క్రిప్షన్ తనిఖీ చేసి, వినియోగదారుడికి మందులు అందజేసే ప్రదేశం స్పష్టంగా కనిపించేలా కెమెరాలు అమర్చాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. నాణ్యత లేని కెమెరాలను అమర్చితే డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది.
ప్రమాణాలు పాటించాల్సిందే లేకపోతే..!
ఏప్రిల్ 1న కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. కెమెరాలు తప్పనిసరిగా ER-01 ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నిర్దేశించిన సైబర్ సెక్యూరిటీ, క్వాలిటీ ప్రమాణాలను పాటించాలి.
ఫార్మసిస్ట్ అసోసియేషన్ల అభ్యంతరం..
ప్రభుత్వ నిర్ణయంపై మందుల దుకాణాల యజమానులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. సర్టిఫైడ్ కెమెరాల కొనుగోలుకు అదనపు భారం పడుతుందని, అలాగే ఈ వీడియో ఫీడ్లను పర్యవేక్షించే అధికారం ఎవరికి ఉంటుందనే విషయంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..!
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com