సాక్షి లైఫ్ : దేశంలో మానసిక ఆరోగ్య సమస్యలతో సతమతమ వుతున్న వారికి బాసటగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం’ (NMHP) ద్వారా సామాన్యులకు సైతం నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని 767 జిల్లాల్లో జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం (DMHP) అమలుకు పచ్చజెండా ఊపింది. ఈ పథకం ద్వారా క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు లభించే ప్రయోజనాలు, తాజా మార్పుల గురించి రాజ్యసభలో మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ వెల్లడించిన ముఖ్యాంశాలు ఇవే..
ఇది కూడా చదవండి..Brain health : మీ బ్రెయిన్ కంప్యూటర్ లాగా పనిచేయాలంటే ఈ ఆహారపదార్థాలు తినండి..
ఇది కూడా చదవండి..Prediabetes : ప్రీడయాబెటిస్ కు గుండె జబ్బుల ప్రమాదానికి లింక్ ఏంటి..?
ఇది కూడా చదవండి..Obesity and inflammation : ఒబెసిటీకి ఇన్ఫ్లమేషన్కు లింక్ ఏమిటి..?
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
గ్రామీణ స్థాయిలో సేవలు..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHC), కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల (CHC) స్థాయిలో కౌన్సెలింగ్, సైకో-సోషల్ ఇంటర్వెన్షన్స్, ఔట్ పేషెంట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా సుమారు 1.83 లక్షల ఉప ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 'ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు'గా ప్రభుత్వం ఆధునీకరించింది. ఇక్కడ సాధారణ చికిత్సలతో పాటు మానసిక ఆరోగ్య సేవలను కూడా ఒక ప్యాకేజీగా అందిస్తున్నారు.
బాలింతలకు..
ప్రసవానంతర మానసిక సమస్యలను (Postpartum) ఎదుర్కొనే తల్లులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఈ పథకంలో మార్పులు చేశారు. ప్రతి జిల్లా స్థాయిలో మానసిక బాధితుల కోసం ప్రత్యేకంగా 10 పడకల ఇన్పేషెంట్ సౌకర్యాన్ని కల్పించారు. మానసిక వైద్య నిపుణుల కొరతను అధిగమించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
25 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్..
మానసిక ఆరోగ్య విభాగాల్లో పీజీ (PG) సీట్లను పెంచేందుకు, మెరుగైన చికిత్స అందించేందుకు 25 అత్యుత్తమ కేంద్రాలను మంజూరు చేసింది. 19 ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని 47 పీజీ విభాగాలను ఆధునీకరించేందుకు కేంద్రం ఆర్థిక సహాయం అందజేస్తోంది.
టెలీ మానసిక సేవలు (Tele-MANAS)..
దూర ప్రాంతాల్లో ఉండి ఆసుపత్రులకు రాలేని వారి కోసం "నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్" ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఫోన్ కాల్ ద్వారానే నిపుణులైన కౌన్సెలర్ల సలహాలు, సూచనలు ఉచితంగా పొందవచ్చు. ప్రస్తుతం దేశంలో నిమ్హాన్స్ (బెంగళూరు), CIP (రాంచీ) వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో పాటు మొత్తం 47 ప్రభుత్వ మానసిక చికిత్సాలయాలు సేవలు అందిస్తున్నాయి. అన్ని ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రుల్లో కూడా ఈ విభాగాలు పనిచేస్తున్నాయి.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..Coconut Water : కొబ్బరి బొండం నీళ్లతో బరువు తగ్గొచ్చా..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com