సాక్షి లైఫ్ : గత కొన్ని దశాబ్దాలుగా దాదాపు కనుమరుగైందనుకున్న ఒక భయంకరమైన అంటువ్యాధి మళ్లీ పంజా విసురుతోంది. ఆస్ట్రేలియాలో సుమారు 50 ఏళ్ల తర్వాత 'డిఫ్తీరియా' అంటే గొంతువాపు వ్యాధి కేసులునమోదవ్వడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులపై ఈ వ్యాధి తీవ్ర ప్రభావం చూపుతుండటంతో వైద్య నిపుణులు అప్రమత్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఏమిటీ డిఫ్తీరియా అంటే..?
ఇది 'కోరినెబాక్టీరియం డిఫ్తీరియే' అనే ప్రమాదకర బాక్టీరియా వల్ల వచ్చే అంటువ్యాధి. ఇది ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థను, చర్మాన్ని దెబ్బతీస్తుంది. గొంతులో మందపాటి బూడిద రంగు పొర ఏర్పడటం దీని ప్రధాన లక్షణం. దీనివల్ల శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. సకాలంలో చికిత్స అందకపోతే ఇది గుండె వైఫల్యం, పక్షవాతం, చివరికి మరణానికి కూడా దారితీయవచ్చు.
ఆస్ట్రేలియాలో పరిస్థితి విషమం..
తాజా గణాంకాల ప్రకారం, ఆస్ట్రేలియాలోని నార్తర్న్ టెరిటరీ, వెస్ట్రన్ ఆస్ట్రేలియా ప్రాంతాల్లో ఈ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ 22 నాటి నివేదిక ప్రకారం, గత కొద్ది కాలంలోనే 17 శ్వాసకోశ డిఫ్తీరియా కేసులు, 60కి పైగా చర్మ సంబంధిత కేసులు నమోదయ్యాయి.
వయస్సుతో సంబంధం లేకుండా నవజాత శిశువుల నుంచి 74 ఏళ్ల వృద్ధుల వరకు ఈ వ్యాధి బారిన పడుతుండటం గమనార్హం.
1926-35 మధ్య ఆస్ట్రేలియాలో ఈ వ్యాధి వల్ల 4,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. టీకాల పుణ్యమా అని 1950ల నాటికి ఇది అదుపులోకి వచ్చింది.
భారత్‌కు పొంచి ఉన్న ముప్పేనా..?
ఆస్ట్రేలియాలో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో భారతీయ ఆరోగ్య నిపుణులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో చాలా చోట్ల సాధారణ టీకాల కార్యక్రమాలు కుంటుపడ్డాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి తగ్గి, డిఫ్తీరియా వంటి వ్యాధులు మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో గవదబిళ్ళలు, తట్టు కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
వ్యాప్తి చెందే మార్గాలు..
వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా సంక్రమణ ఉన్న వ్యక్తులతో సన్నిహితంగా ఉండటం వల్ల మురికివాడలు, జనసమ్మర్థం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వ్యాప్తి వేగం ఎక్కువ.
లక్షణాలు ఎలా ఉంటాయంటే..?
తీవ్రమైన గొంతు నొప్పి, జ్వరం, నీరసం.
గొంతులో బూడిద రంగు మందపాటి పొర.
మెడ భాగం వాపు (Bull neck).
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మింగడం కష్టమవ్వడం.
ముందు జాగ్రత్తలు, నివారణ..?
ఈ వ్యాధిని నివారించడానికి DPT (డిఫ్తీరియా, పెర్టూసిస్, టెటానస్) టీకా అత్యంత కీలకం. పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ద్వారా 100శాతం రక్షణ పొందవచ్చు. చేతులను శుభ్రంగా కడుక్కోవడం, రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించడం ఉత్తమం. ఆయా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స ప్రారంభించాలి. టీకాల పట్ల నిర్లక్ష్యం వహిస్తే పాత రోగాలు కొత్త రూపంలో విరుచుకుపడతాయని, కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచిస్తోంది.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com