సాక్షి లైఫ్ : ఇల్లు తగలబడుతుంటేనో.. వరద ముంచెత్తుతుంటేనో మనం ఆ సమయంలో పడే ఆవేదన వర్ణనాతీతం. మరి కోట్లాది జీవరాశులకు ఆశ్రయమిస్తున్న ఈ నేలతల్లి పరిస్థితి ఏమిటి..? అభివృద్ధి ముసుగులో మనం చేస్తున్న విధ్వంసం భూమిని చిన్నాభిన్నం చేస్తోంది. పొగలు కక్కుతున్న గాలి, విషతుల్యమైన నీరు, తరిగిపోతున్న వనరులు.. వెరసి భూగోళం ఇప్పుడు తీవ్రమైన జ్వరంతో ఊగిసలాడుతోంది. నేడు ‘ప్రపంచ భూమి దినోత్సవం’. ఈ ఏడాది ‘మన శక్తి మన గ్రహం’ (Our Energy, Our Planet) అనే థీమ్ తో ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఇది కూడా చదవండి..Wellness Zone in the Sky : ఆకాశంలోనే 'వెల్నెస్ జోన్'.. సుదీర్ఘ విమాన ప్రయాణమైనా ఇక హాయిగా..!
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
ఆరంభం ఎక్కడ అంటే..?
1970లో అమెరికా సెనేటర్ గేలార్డ్ నెల్సన్ పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఈ ఉద్యమానికి అంకురార్పణ చేశారు. విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొనేందుకు వీలుగా ఏప్రిల్ 22ను ఎంచుకున్నారు. ఆనాడు అమెరికాలో మొదలైన ఈ చిరు ప్రయత్నం, నేడు 190కి పైగా దేశాల్లో ఒక మహా ఉద్యమంగా మారింది.
మనకు ఎందుకు ఈ ప్రమాదం..?
ప్రకృతిని మనం ఒక వనరుగా కాకుండా, ఒక ఆస్తిగా భావించి దోచుకోవడమే ప్రస్తుత విపత్తుకు కారణం. ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలవడానికి కొన్ని వందల ఏళ్లు పడుతోంది. ఇది భూసారాన్ని తగ్గించడమే కాకుండా భూగర్భ జలాలను విషపూరితం చేస్తోంది. శిలాజ ఇంధనాల వాడకం వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతోంది. దీనివల్ల రుతుపవనాలు గతి తప్పుతున్నాయి, అకాల వర్షాలు, తీవ్రమైన ఎండలు మనల్ని వేధిస్తున్నాయి.
తరిగిపోతున్న పచ్చదనం..
అడవుల నరికివేత వల్ల జీవవైవిధ్యం దెబ్బతింటోంది. వన్యప్రాణులు నివాసాలు కోల్పోయి జనారణ్యంలోకి వస్తున్నాయి. భూమిని కాపాడుకోవడమంటే మనల్ని మనం కాపాడుకోవడమే. ఇందుకు పెద్ద పెద్ద ప్రయోగాలు అక్కర్లేదు, చిన్న మార్పులు చాలు..చుక్క చుక్కా ఒడిసిపడదాం.. భూగర్భ జలాలను కాపాడుకుందాం.
ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, దాన్ని పెంచే బాధ్యత తీసుకోవాలి. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ (Single-use plastic) కు స్వస్తి చెబుదాం. అవసరం లేనప్పుడు విద్యుత్ ఉపకరణాలను ఆపివేయడం, పునరుత్పాదక ఇంధనాల (సౌరశక్తి) వైపు మొగ్గు చూపడం ఈ ఏడాది థీమ్ ప్రధాన ఉద్దేశ్యం. వచ్చే తరాలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి.. కోట్లు విలువ చేసే భవంతులు కాదు, స్వచ్ఛమైన గాలిని ఇచ్చే ప్రకృతి. భావితరాల బాగుకోసం నేడే మేల్కొందాం..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
Tags :
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com