World Asthma Day 2026: మారుతున్న జీవనశైలి కారణంగా పెరుగుతున్న ఆస్తమా కేసులు..! తాజా గణాంకాలు..
సాక్షి లైఫ్ : పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న జీవనశైలి కారణంగా దేశవ్యాప్తంగా ఆస్తమా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేడు మే 5వతేదీన 'వరల్డ్ ఆస్తమా డే' సందర్భంగా బాధితులందరికీ ఇన్‌హేలర్లు అందుబాటులో ఉండాల్సిన అవసరాన్ని వైద్యులు గుర్తుచేస్తున్నారు.
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
పెరుగుతున్న ముప్పు..
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 26 కోట్ల మంది ఆస్తమాతో బాధపడు తుండగా, ఏటా 4.5 లక్షల మందికి పైగా మరణిస్తున్నారు. మొత్తం ప్రపంచ ఆస్తమా భారంలో భారత్ వాటా 13 శాతంగా ఉంది. అవగాహన లోపం, సరైన చికిత్స అందకపోవడం వల్ల మనదేశంలో మరణాల రేటు ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కారణాలు ఇవే..
నగరాల్లో వాయు కాలుష్యం, నిర్మాణ రంగం నుంచి వచ్చే దుమ్ము, వాహనాల ఉద్గారాలు శ్వాసకోశ వ్యాధులకు ప్రధాన కారణమవుతు న్నాయి. గాలి వెలుతురు సరిగ్గా లేని గదుల్లో ఉండటం, ఏసీలను అధికంగా వాడటం, ఇంట్లోని పెంపుడు జంతువుల వెంట్రుకలు, ఫంగస్ కూడా ఆస్తమాను తీవ్రతరం చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో బహిరంగ కాలుష్యం కంటే ఇంట్లోని కాలుష్యమే ఎక్కువ హాని చేస్తోందని సీనియర్ పల్మనాలజిస్టులు చెబుతున్నారు.
లక్షణాలు.. జాగ్రత్తలు
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పిల్లి కూతలు, ఛాతీలో బిగుతుగా ఉండటం, విడవని దగ్గు. జంక్ ఫుడ్ తగ్గించాలి, విపరీతమైన వాతావరణ మార్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆస్తమాను ప్రాథమిక దశలోనే గుర్తించి నిరంతరం చికిత్స పొందితే సాధారణ జీవితాన్ని గడపవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల్లో ఇన్‌హేలర్లను కొనుగోలు చేయలేక సరైన చికిత్స అందడం లేదని, దీనివల్ల మరణాల రేటు పెరుగుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
