World Hemophilia Day 2026 : హిమోఫిలియా డిసీజ్ వంశపారంపర్యంగా వస్తుందా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : గాయమైనప్పుడు రక్తం గడ్డకట్టకపోవడం ఒక తీవ్రమైన సమస్య. ఇదే హిమోఫిలియా. వంశపారంపర్యంగా వచ్చే ఈ జన్యుపరమైన వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏటా ఏప్రిల్ 17ను 'ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం'గా జరుపుకుంటు న్నాం. ఈ నేపథ్యంలో వ్యాధి లక్షణాలు, ప్రాముఖ్యత మరియు ఈ ఏడాది ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం.

 

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ రావడానికి ప్రధాన కారణాలు..?

ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

హిమోఫిలియా అంటే ఏమిటి..?

సాధారణంగా దెబ్బ తగిలినప్పుడు రక్తంలోని కొన్ని కారకాలు (Clotting Factors) రక్తాన్ని గడ్డకట్టేలా చేస్తాయి. కానీ హిమోఫిలియా ఉన్నవారిలో ఈ కారకాల లోపం వల్ల రక్తం త్వరగా గడ్డకట్టదు. దీనివల్ల చిన్న గాయమైనా సరే రక్తస్రావం నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది. ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.

లక్షణాలు ఎలా గుర్తించాలి..? 

గాయం తగిలినప్పుడు రక్తస్రావం ఎక్కువ సేపు జరగడం.

కీళ్లలో తరచుగా వాపు, విపరీతమైన నొప్పి రావడం.

ముక్కు నుంచి అకస్మాత్తుగా రక్తం కారడం.

చర్మంపై నీలి రంగు మచ్చలు ఏర్పడటం.

శస్త్రచికిత్సలు లేదా పళ్లు పీకినప్పుడు రక్తస్రావం అదుపులోకి రాకపోవడం.

 ఫ్రాంక్ ష్నాబెల్ పుట్టినరోజు సందర్భంగా.. 

వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హిమోఫిలియా (WFH) వ్యవస్థాపకుడు ఫ్రాంక్ ష్నాబెల్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 17ను ఈ దినోత్సవంగా నిర్ణయించారు. 1989 నుంచి ఈ రోజన ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

2026 థీమ్: "రోగ నిర్ధారణే.. సంరక్షణకు తొలి అడుగు"ఈ ఏడాది "Equitable access for all: recognizing all bleeding disorders" (అందరికీ సమానమైన చికిత్స, అన్ని రక్తస్రావ రుగ్మతల గుర్తింపు) అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా వ్యాధిని తొలిదశలో గుర్తించడం (Diagnosis) ద్వారానే మెరుగైన చికిత్స అందించడం సాధ్యమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 

వంశపారంపర్యంగా ఈ సమస్య ఉన్నవారు ముందుగానే రక్త పరీక్షలు చేయించుకోవాలి. గాయాలు కాకుండా జాగ్రత్త వహించాలి. ఏదైనా శస్త్రచికిత్సకు ముందు వైద్యులకు తమ పరిస్థితిని వివరించాలి. రెగ్యులర్ చెకప్స్ ,వైద్యుల సలహా మేరకు క్లాటింగ్ ఫ్యాక్టర్ ఇంజెక్షన్లు తీసుకోవాలి. సరైన అవగాహన, సకాలంలో గుర్తిస్తే హిమోఫిలియా ఉన్నవారు కూడా సాధారణ జీవితాన్ని గడపవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.  

 

ఇది కూడా చదవండి..డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏమిటి..? 

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ ఎలాంటి వారికి వస్తుంది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.