Is the Cicada Variant Deadly..? సికాడతో ప్రాణాలకు ముప్పేనా..? అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్.. 

సాక్షి లైఫ్ : ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మరో కొత్త రూపంలో మరొక సారి విరుచుకుపడుతోంది. ప్రస్తుతం అమెరికాలో 'సికాడ (Cicada)' గా పిలిచే BA.3.2 వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 23దేశాల్లో సోకిన ఈ వేరియంట్ అమెరికాలోని 25రాష్ట్రాల్లో వేగంగా వ్యాపిస్తోంది. రానున్న రోజుల్లో మరింతగా ప్రమాదకరంగా   మారే అవకాశం ఉందని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?

 

ఏమిటీ సికాడ వేరియంట్..?

గత ఏడాది (2024) నవంబర్‌లో దక్షిణాఫ్రికాలో ఈ వేరియంట్‌ను తొలిసారిగా గుర్తించారు. ఇది ఒమిక్రాన్ కుటుంబానికి చెందిన ఉప రకం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనిని 'వేరియంట్ అండర్ మానిటరింగ్' జాబితాలో చేర్చింది. ఇప్పటికే అమెరికాలోని 25 రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 23 దేశాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. ఈ వేరియంట్ స్పైక్ ప్రోటీన్‌లో సుమారు 70 నుంచి 75 మార్పులు (mutations) జరిగినట్లు సీడీసీ (CDC) గుర్తించింది. దీనివల్ల ఇది రోగనిరోధక శక్తిని సులభంగా తప్పించుకునే ప్రమాదం ఉంది.


సికాడ వేరియంట్ సోకిన వారిలో సాధారణంగా కనిపించే లక్షణాలు..

తీవ్రమైన జ్వరం లేదా ఒళ్లు వణుకు

నిరంతరాయంగా దగ్గు, గొంతు నొప్పి

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

అలసట, తలనొప్పి

వాసన, రుచి కోల్పోవడం

ముక్కు దిబ్బడ లేదా జలుబు

టీకాలు పనిచేస్తాయా..?

ఈ వేరియంట్ పాత ఇన్ఫెక్షన్ల ద్వారా వచ్చిన రోగనిరోధక శక్తిని, అలాగే ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ల ప్రభావం నుంచి తప్పించుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే, వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వ్యాధి తీవ్రత తగ్గడమే కాకుండా, ప్రాణాపాయం నుంచి రక్షణ లభిస్తుందని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేసింది.

ఆందోళన వద్దు.. జాగ్రత్త ముఖ్యం..!

ప్రస్తుతానికి ఈ వేరియంట్ వల్ల మరణాలు లేదా ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య భారీగా పెరగనప్పటికీ, ఇది వేగంగా వ్యాప్తి చెందే గుణం కలిగి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, అపరిశుభ్రమైన ప్రదేశాలకు దూరంగా ఉండటం ద్వారా ఈ వైరస్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు.

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : america european-covid-variant who-covid-alert covid-news cicada-variant
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com