సాక్షి లైఫ్ : ఒకప్పుడు ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా ఇంట్లో ఉండే పెద్దలనో, మన ఫ్యామిలీ డాక్టర్ నో అడిగేవాళ్లం. కానీ ప్రస్తుతం ఆ ట్రెండ్ పూర్తిగా మారింది. అరచేతిలో ఉన్న స్మార్ట్‌ఫోనే మన ఫ్యామిలీ డాక్టర్ గా మారి పోయింది. 2025 సంవత్సరంలో భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికిన అనారోగ్య సమస్యలకు సంబంధించిన ప్రశ్నలేమిటో తెలుసుకుందామా..? మరి..!
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
ఇది కూడా చదవండి...కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
ఫ్లూనా లేక కోవిడా..? లేక డెంగ్యూ లక్షణాలా..?
అయిదేళ్లు గడిచినా 'కోవిడ్' భయం జనాల్లో ఇంకా పూర్తిగా వీడలేదు. 2025లో అత్యధికంగా వెతికిన ప్రశ్న - "జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు ఉంటే అది సాధారణ ఫ్లూనా లేక కోవిడా? లేక డెంగ్యూ లక్షణాలా?" అని. వీటి మధ్య తేడాలను తెలుసుకోవడానికి, ఎప్పుడు ఆసుపత్రికి వెళ్లాలి, ఎప్పుడు టెస్ట్ చేయించుకోవాలి అనే విషయాల మీద గూగుల్‌లో శోధనలు వెల్లువెత్తాయి.
మధుమేహం.. నియంత్రణ ఎలా..?
భారత్‌ను 'ప్రపంచ డయాబెటిస్ రాజధాని' అని ఎందుకు అంటారో ఈ సెర్చ్ ట్రెండ్స్ చూస్తే అర్థమవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని (HbA1c) సహజంగా తగ్గించడం ఎలా..?, ప్రీ-డయాబెటిస్ నురివర్స్ చేయవచ్చా? అనే ప్రశ్నలు టాప్ లిస్టులో ఉన్నాయి. ముఖ్యంగా యువతలో ఈ అవగాహన పెరగడం విశేషం.
అలసటగా ఉండడానికి కారణాలు..?
అలసటగా ఉండడానికి కారణాలు ఏమిటి..?ఈ ప్రశ్న 2025లో ఒక హాట్ టాపిక్ గా మారింది. నిద్రలేమి, ఒత్తిడి, విటమిన్ "డి", బి12 లోపం, థైరాయిడ్ సమస్యలు.. ఇలా రకరకాల కారణాల గురించి నెటిజన్లు ఆరా తీశారు. డిజిటల్ యుగంలో 'బ్రెయిన్ ఫాగ్' (మానసిక మందకొడితనం) గురించి కూడా చర్చలు జరిగాయి.
బీపీ, కొలెస్ట్రాల్..
గుండె జబ్బులు పెరుగుతున్న నేపథ్యంలో "రక్తపోటును (BP), కొలెస్ట్రాల్(Cholesterol)ను మందులు లేకుండా ఎలా తగ్గించుకోవాలి?" ఆహార నియమాలు, వ్యాయామం, రోజుకు ఉప్పు ఎంత తీసుకోవాలి..? సాల్ట్ ఎక్కువగా తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..? హెల్త్ కోసం ఎలాంటి జీవనశైలి మార్పులు ఆచరించాలి..? అనే సందేహాలపై కోట్లాది మంది గూగుల్ తల్లిని అడిగారు.
అజీర్తి.. కడుపుబ్బరం..
ఆధునిక ఆహారపు అలవాట్ల కారణంగా కడుపుబ్బరం (Bloating) ఎందుకు వస్తుంది..?, జీర్ణక్రియను మెరుగుపరుచుకోవడం ఎలా..? అనేవి తరుచూ కనిపించిన ప్రశ్నలు. అలాగే లివర్ (liver) ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి..? అనే అంశాలను గురించి జనాలు గూగుల్ సెర్చ్ లో మరింతగా వెతికారు.
బరువు తగ్గించే ఇంజెక్షన్లు..
2025లో సరికొత్త ట్రెండ్.. బరువు తగ్గించే మందులు (Ozempic, Wegovy వంటివి వాటిని గురించి తెలుసుకోవడానికి యూజర్స్ ఆసక్తి చూపించారు. ఒజెంపిక్, వెగోవి వంటి వెయిట్ ను తగ్గించే ఇంజెక్షన్లు ఇండియాలోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి..? వీటి ధరలు, దుష్ప్రభావాలు, ఇవి నిజంగా పని చేస్తాయా అనే విషయాలపై గూగుల్‌లో విపరీతంగా సెర్చ్ చేశారు.
గూగుల్‌లో సమాచారం సేకరించడం మంచిదే కానీ, ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా..? గూగుల్ పైనే ఆధారపడి సొంతంగా వైద్యం (Self-medication) చేసుకోకూడదు. ఒకవేళ ఏదైనా సందేహం ఉంటే తప్పనిసరిగా వైద్యనిపుణులను సంప్రదించాలి. అంతేగానీ గూగుల్ లో ప్రతి అనారోగ్య సమస్యకు పరిష్కారమార్గాలు వెతికి అలాంటి వాటిని పాటించకపోవడమే మేలు.
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
ఇది కూడా చదవండి..అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com