TrumpRx’ Strategy : ఔషధ ధరల తగ్గింపునకు అమెరికా సరికొత్త వ్యూహం.. ‘ట్రంప్‌ఆర్‌ఎక్స్’ వెబ్సైట్లో 600కు పైగా జెనరిక్ మందులు..!
సాక్షి లైఫ్ : అమెరికాలో సామాన్యుడికి వైద్య ఖర్చులను తగ్గించడమే లక్ష్యంగా అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోగులకు తక్కువ ధరకే నాణ్యమైన మందులను చేరువ చేసేందుకు ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న ‘TrumpRx.gov’ వెబ్సైట్లో భారీ మార్పులు చేపట్టారు. ఈ పోర్టల్‌లో ఇకపై నిత్యం వాడే అత్యవసర జెనరిక్ (Generic) మందులను కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
తాజా నిర్ణయంతో కొలెస్ట్రాల్ నియంత్రణకు వాడే ‘అటోర్వాస్టాటిన్’, మధుమేహం కోసం ఉపయోగించే ‘మెట్ఫార్మిన్’ వంటి సుమారు 600కు పైగా విస్తృతంగా వాడే జెనరిక్ ఔషధాల ధరల వివరాలు ఈ సైట్లో దర్శనమివ్వనున్నాయి.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఏడు రెట్లు పెరిగిన జాబితా..
ఈ ఏడాది జనవరిలోనే ప్రారంభమైన ఈ వెబ్సైట్లో ఇప్పటివరకు కేవలం బ్రాండెడ్ మందుల వివరాలు మాత్రమే ఉండేవి. తాజా మార్పులతో మందుల సంఖ్య దాదాపు ఏడు రెట్లు పెరిగింది. అయితే, ఈ వెబ్సైట్ నేరుగా మందులను విక్రయించదు. ఏ ఫార్మసీలో ఎంత ధరకు మందులు లభిస్తున్నాయో పోల్చి చూపిస్తూ, వినియోగదారులను ఆయా డిస్కౌంట్ విక్రయదారుల సైట్లకు అనుసంధానిస్తుంది. అమెరికాలో విక్రయమయ్యే మందుల్లో 90 శాతానికి పైగా జెనరిక్ రకాలే కావడంతో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
దిగ్గజ సంస్థల డిస్కౌంట్లు ఒకే చోట..
ప్రముఖ వ్యాపారవేత్త మార్క్ క్యూబన్కు చెందిన 'కాస్ట్ ప్లస్ డ్రగ్స్'తో పాటు అమెజాన్ ఫార్మసీ, గుడ్ఆర్ఎక్స్ వంటి దిగ్గజ డిస్కౌంట్ సంస్థల ధరలను కూడా ఈ ప్రభుత్వ పోర్టల్‌లో విలీనం చేశారు. ఫలితంగా రోగులు తమకు సమీపంలోని ఫార్మసీల్లో ఉన్న ధరలతో పాటు ఆన్లైన్ డిస్కౌంట్లను సులభంగా పోల్చి చూసుకోవచ్చు.
పరిమితులు ఇవే..
నియంత్రిత మందులకు మినహాయింపు: తీవ్రమైన దుష్ప్రభావాలు ఉండే ప్రమాదకరమైన మందులు, ఎఫ్‌డీఏ (FDA) ప్రత్యేక నిబంధనలు కలిగిన (REMS) ఔషధాలు, సాధారణంగా మార్కెట్లో దొరకని కొన్ని ప్రత్యేక డ్రగ్స్‌ను ఈ జాబితా నుండి మినహాయించారు. ఈ సేవలన్నీ ప్రధానంగా హెల్త్ ఇన్సూరెన్స్ లేని వారిని ఉద్దేశించి రూపొందించినవి. కాబట్టి ఈ వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేసే మందుల ఖర్చు ఇన్సూరెన్స్ డిడక్టబుల్స్ పరిధిలోకి రాకపోవచ్చు.
అంతర్జాతీయ మార్కెట్‌తో పోటీ..
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మందులపై మూడేళ్ల పాటు సుంకాల మినహాయింపు ఇచ్చేలా దాదాపు 17 ప్రముఖ ఫార్మా కంపెనీలతో అమెరికా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల రాబోయే పదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో దాదాపు 64 బిలియన్ డాలర్ల మేర నిధులు ఆదా అవుతాయని శ్వేతసౌధం అంచనా వేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత చౌకగా మందులను అందిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, బ్రిటన్ వంటి కొన్ని అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇక్కడి ధరలు ఇంకా కాస్త ఎక్కువే ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా భీమా లేని సామాన్య రోగులకు ఈ విధానం కొంత ఊరటనిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..New Guidelines : శరీరానికి అవసరమయ్యే నీటి పరిమాణంలో కొత్త మార్గదర్శకాలు..
ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
