Heart care : గుండె జబ్బులకు సరికొత్త చికిత్స.. కోత లేకుండానే హార్ట్ వాల్వ్ రీప్లేస్ మెంట్ 'టెవర్' (TAVR) విధానం
సాక్షి లైఫ్ : వృద్ధులు, తీవ్రమైన గుండె సమస్యలతో బాధపడేవారికి అత్యాధునిక ట్రాన్స్‌క్యాథెటర్ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ (TAVR - టెవర్) విధానం ఒక వరంగా మారుతోంది. గుండె కవాటం కుచించుకుపోవడం (అయోర్టిక్ స్టెనోసిస్) వల్ల క్రమంగా గుండె వైఫల్యం చెందడం లేదా ఆకస్మిక మరణం సంభవించే ప్రమాదం ఉంది. గతంలో ఇలాంటి పరిస్థితుల్లో ఛాతీని కోసి చేసే 'ఓపెన్ హార్ట్ సర్జరీ' మాత్రమే మార్గంగా ఉండేది. కానీ ఇప్పుడు 'టెవర్' (TAVR) విధానం ద్వారా ఎలాంటి పెద్ద కోతలు లేకుండానే, అత్యంత సులభంగా కవాటాన్ని మార్చుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..?
హైదరాబాద్‌లోని ఏఐజీ (AIG) ఆసుపత్రికి చెందిన కార్డియాలజిస్టులు ఈ విధానంలో విశేష కృషి చేస్తున్నారు. గత ఏడాది కాలంలో తమ ఆసుపత్రిలో సుమారు 100 'టెవర్' ప్రొసీజర్లు నిర్వహించినట్లు ఏఐజీ కార్డియాక్ క్యాథ్‌ల్యాబ్ డైరెక్టర్ డాక్టర్ అనూజ్ కపాడియా, కో-డైరెక్టర్ డాక్టర్ స్వరూప్ భరద్వాజ్ తెలిపారు. నగరవ్యాప్తంగా చూస్తే ఈ ఏడాది సుమారు 350 నుంచి 400 వరకు ఈ చికిత్సలు జరిగినట్లు అంచనా వేస్తున్నారు.
'టెవర్' విధానం వల్ల ప్రయోజనాలు ఇవే..
ఒకప్పుడు అత్యంత ఖరీదైన చికిత్సగా ఉన్న దీని ధర ఇప్పుడు సామాన్యులకు కొంత అందుబాటులోకి వచ్చింది. గతంలో ఈ చికిత్సకు సుమారు రూ. 40 లక్షల వరకు ఖర్చయ్యేది. ఇప్పుడు ఆ ధర రూ. 16 నుంచి 17 లక్షలకు తగ్గినట్లు డాక్టర్ కపాడియా తెలిపారు.
అందరికీ అందుబాటులోకి: మొదట్లో 80 ఏళ్లు పైబడిన వారికి లేదా ఓపెన్ హార్ట్ సర్జరీకి శరీరం సహకరించని వృద్ధులకు మాత్రమే ఈ విధానాన్ని సూచించేవారు. కానీ ఇప్పుడు సాంకేతికత పెరగడంతో, తక్కువ రిస్క్ ఉన్న యువ రోగులకు కూడా ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు.
టెక్నాలజీ, సర్జరీ విధానాల్లో వచ్చిన మార్పుల వల్ల భద్రత పెరిగింది. పక్షవాతం (స్ట్రోక్), భారీ రక్తస్రావం వంటి కాంప్లికేషన్లు వచ్చే ప్రమాదం గతంలో 7 నుంచి 8 శాతం ఉండగా, ఇప్పుడు అది కేవలం 1 నుంచి 2 శాతానికి పడిపోయింది. ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే ఆసుపత్రిలో రోజుల తరబడి ఉండాలి. కానీ ఈ 'టెవర్' విధానంలో చికిత్స తీసుకున్న 48 నుంచి 72 గంటల్లోనే రోగులు పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లొచ్చు.
గుండె కవాట సమస్యలతో వచ్చే ప్రతి రోగి పరిస్థితిని కార్డియాలజిస్టులు, సర్జన్లు, అనస్థీటిస్టులతో కూడిన మా ప్రత్యేక బృందం పూర్తిగా అంచనా వేస్తుంది. ఆ తర్వాతే వారికి ఎలాంటి చికిత్స అవసరమో దీర్ఘకాలిక ప్రణాళికతో నిర్ణయిస్తాం" అని డాక్టర్ స్వరూప్ భరద్వాజ్ స్పష్టం చేశారు. ఓపెన్ హార్ట్ సర్జరీతో సమానమైన ఫలితాలను ఇస్తూ, తక్కువ నొప్పితో వేగంగా కోలుకునే అవకాశం ఉండటంతో రోగులు ఈ విధానం వైపు మొగ్గుచూపుతున్నారు.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..
ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
