Social Phobia : నలుగురిలోకి వెళ్లాలంటే భయమా..? మీలో 'సోషియోఫోబియా' లక్షణాలు ఉన్నాయేమో..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పనిచేసే ఆఫీసులో మీ పనులన్నీ చక్కగా, సమయానికి పూర్తి చేస్తారు. కానీ, మీటింగ్ రూమ్‌లో నలుగురి ముందు మీ అభిప్రాయం చెప్పాల్సి వస్తే మాత్రం ఒక్కసారిగా టెన్షన్ మొదలవుతుందా..? గుండె వేగం పెరగడం, కాళ్లు, చేతులు వణకడం, ఏం మాట్లాడాలో తెలియక టెన్షన్ పడిపోవడం వంటివి జరుగుతున్నాయా..? అయితే మీరు 'సోషియో ఫోబియా' (Sociophobia) బారిన పడ్డారని గమనించాలి. ఇతరుల ముందు మాట్లాడటానికి, సామాజిక సమావేశాలకు హాజరవడానికి తీవ్రంగా భయపడటాన్ని 'సోషియోఫోబియా' లేదా స్టేజ్ ఫియర్ అంటారని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి.. మధుమేహం ఉన్నవారికి మేలుచేసే పప్పు..? 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 

అసలు ఈ భయానికి కారణం ఏంటి..?

"నేను మాట్లాడేది తప్పైతే ఇతరులు ఏమను కుంటారు..? నన్ను చూసి నవ్వుతారేమో..!" అనే అతి పెద్ద ఆందోళనే దీనికి ప్రధాన కారణం. ఈ భయం వల్ల మనసులోనే రకరకాల పదాలతో ప్రశ్నలను సిద్ధం చేసుకుంటూ ఉండిపోతారు. తీరా ఆ ఆలోచనల్లోంచి బయటకు వచ్చేసరికి మీటింగ్ ముగిసిపోతుంది.

ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే మౌనం..

మీటింగుల్లో మీరు మౌనంగా ఉండటం వల్ల, మీపై అధికారులకు మీకు సబ్జెక్ట్ మీద అవగాహన లేదేమో అనే అభిప్రాయం కలిగే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు మీరు చెప్పాలనుకున్న పాయింట్‌నే సహోద్యోగులు చెప్పి క్రెడిట్ కొట్టేస్తుంటారు. అప్పుడు "అయ్యో! నేను మాట్లాడి ఉంటే బాగుండేది" అనే పశ్చాత్తాపం మిమ్మల్ని వెంటాడుతుంది. ఇది క్రమంగా ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుంది.

తప్పులు సహజం..!

పొరపాట్లు చేయడం మనుషులకు సహజం. పెద్ద పెద్ద పొజిషన్లలో ఉన్నవారు కూడా కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు తడబడతారు. కాబట్టి మీపై మీరు అనవసరమైన ఒత్తిడిని పెంచుకోకండి. మీ ఆలోచనలు సానుకూలంగా మార్చుకుని, మీరు అడిగే ప్రశ్న మీ ఎదుగుదలకు తోడ్పడుతుందని నమ్మండి.

ఈ భయాన్ని అధిగమించడం ఎలా..?

 చిన్న చిన్న అడుగులతో.. ముందస్తు ప్రిపరేషన్: మీటింగ్ అజెండా ఏంటో ముందుగానే తెలుసుకుని, ఆ అంశంపై కొంచెం రీసెర్చ్ చేయండి. పూర్తి సమాచారం మీ దగ్గర ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆందోళన తగ్గి, మనసు ప్రశాంతంగా ఉంటుంది.

దీర్ఘ శ్వాస (Deep Breathing)..

 మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు గుండె వేగం పెరిగితే.. 3, 4 సార్లు గట్టిగా, లోతుగా శ్వాస తీసుకోండి. ఇది మీ నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది.

చిన్నగా ప్రారంభించండి..

ఒకేసారి పెద్ద స్పీచ్ ఇవ్వక్కర్లేదు. మీటింగ్‌లో వేరొకరి అభిప్రాయాన్ని సమర్థించడమో, లేదా ఒక చిన్న ప్రశ్న అడగడమో చేయండి.

ఐ కాంటాక్ట్ సాధన..

ఇంట్లో అద్దం ముందు నిలబడి మాట్లాడటం ప్రాక్టీస్ చేయండి. ఆఫీస్ మీటింగ్‌లో మాట్లాడేటప్పుడు మీకు సపోర్ట్‌గా ఉండే స్నేహితులు లేదా సహోద్యోగుల కళ్లల్లోకి చూస్తూ మాట్లాడటానికి ప్రయత్నించండి. మొదట్లో కొంచెం కష్టంగా అనిపించినా, నిరంతర సాధనతో ఈ సామాజిక భయాన్ని జయించి మీరే అందరిలో ప్రత్యేకంగా నిలబడవచ్చని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. 

 

ఇది కూడా చదవండి.. మండే ఎండల్లో చల్లటి నీరు తాగుతున్నారా..?

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..? 

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.