రిఫ్రిజ్ రేటర్ విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. 

సాక్షి లైఫ్ : రిఫ్రిజ్ రేటర్లో ఐస్‌క్రీములు, పచ్చిమాంసం లాంటివి పెడుతుంటారు. ఫ్రీజర్‌లో ఉష్ణోగ్రతలు బాగా తక్కువగా ఉంటాయి. అక్కడ సూక్ష్మజీవుల మనుగడ దాదాపు అసాధ్యం.అయితే, వీటిని బయటకు తీసి కరిగించడంలోనే ఉంది అసలు చిక్కు. త్వరగా కరగడానికి నీళ్లల్లో కూడా పెడుతుంటారు. బయట ఉంచినా, నీళ్లల్లో ఉంచినా ఆహారం కలుషితం కావడానికి అవకాశాలు ఎక్కువ. కరుగుతుంటే నీరు కారుతుంటుంది. 

ఇది కూడా చదవండి.. సైనసిటిస్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది..?

దీనివల్ల బాక్టీరియా విజృంభిస్తుంది. ఫ్రిడ్జిలోనే ఉంచి డీఫ్రోజ్‌ చేయడం మేలు. అలా చేస్తే ఆహార పదార్థాల రూపం కూడా మారదు. ఒకవేళ మనం తొందర్లో ఉంటే, మైక్రోవేవ్‌లో పెట్టి కరిగించడం మేలు. మైక్రోవేవ్‌లో డీఫ్రో‌‌జ్‌కి ఒక ఫంక్షన్ ఉంటుంది. ప్యాకెట్టుకు కన్నాలున్నా, లేదా లీక్ అవుతున్నా బాక్టీరియా ఇతర పదార్థాలకు వ్యాపిస్తుంది. కాబట్టి కొనుక్కొచ్చిన మాంసాన్ని అలా ఫ్రిడ్జిలో పెట్టకుండా, కవరు తీసి వేరే గిన్నెలోకి మార్చి లోపల పెట్టాలి. మూత పెట్టడం మరచిపోకూడదు.ఒకటి లేదా రెండురోజుల్లో వండుకోవాలను కుంటే ఫ్రిడ్జిలోనే ఉంచవచ్చు. అంతకన్నా ఎక్కువ రోజులైతే ఫ్రీజర్‌లో ఉంచడం మంచిది. 

 తరచూ ఫ్రిడ్జిని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. మరకలు, బయటకు చిందిన పదార్థాలు శుభ్రం చేయాలి. వీటన్నిట్లోనూ సూక్ష్మజీవులు వృద్ధి చెందే అవకాశం ఉంది. ముందు ఫ్రిడ్జి ప్లగ్ తీసేయాలి. కరంట్ ఆపేయాలి. లోపలున్న పదార్థాలన్నీ బయటకు తీయాలి. పాతవి ఏమైనా ఉంటే ఎక్స్‌పైరీ డేటు చూసి పారేసేందుకు ఇదే మంచి సమయం. 

అరలు, డ్రాయర్లు వంటివి బయటకు తీసి శుభ్రంగా నీటితో కడగాలి. అవి పొడిగా ఆరేవరకు లోపల పెట్టకూడదు. స్పాంజి లేదా తడిగుడ్డతో ఫ్రిడ్జి అంతా తుడవాలి. తరువాత పొడిక్లాత్ తో తుడవాలి. చివరిగా, మళ్లీ అన్నీ లోపల పెట్టి, సర్దుకున్నాక ప్లగ్ ఆన్ చేయాలి. చికెన్ , మటన్ బాగా ఉడికించాలి. వండుతున్నప్పుడు ఉష్ణోగ్రత కనీసం 70°Cకి చేరుకుంటే, వాటిలోని బాక్టీరియా అంతా తొలగిపోతుంది.

ఇది కూడా చదవండి.. ఎల్‌డిఎల్ ను నియంత్రించే అద్భుతమైన ఫుడ్..


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : food-health non-veg healthy-habits refrigerator precautions green-vegetables good-habits chicken bad-habit mutton
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com