గర్భిణీ స్త్రీ ఆరోగ్యం బిడ్డపై ఎలాంటి ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది..?
సాక్షి లైఫ్ : తల్లికి సరైన పోషకాహారం, మానసిక ప్రశాంతత చాలా అవసరం. మధు మేహం, అధిక రక్తపోటు, ఒత్తిడి, పోషకాహార లోపం వంటి పరిస్థితులు తల్లి ఆరోగ్యంపై మాత్రమే కాకుండా శిశువుల పెరుగుదల, రోగనిరోధక శక్తి మానసిక అభివృద్ధిపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అందువల్ల, గర్భిణీ స్త్రీలు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, సమతుల్య ఆహారం తీసుకోవాలని, తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండటానికి క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. డెలివరీకి ముందు గర్భిణీలు "సీ" ఫుడ్ తినకూడదా..?
ఇది కూడా చదవండి.. అధిక రక్తపోటు లక్షణాలు..?
ఇది కూడా చదవండి.. మందులు లేకుండా అధిక రక్తపోటును నియంత్రించే మార్గాలు
తల్లి ఆరోగ్యం పిల్లల అభివృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..?
గర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్యం పిల్లల అభివృద్ధిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. తల్లి ఆహారం సరిగ్గా తీసుకోకపోతే లేదా ఆమె అనారోగ్యంతో బాధపడుతుంటే, అది పిల్లల శారీరక, మానసిక అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. తల్లి ఆరోగ్యం బాగుంటే, బిడ్డ బరువు, అభివృద్ధి మెరుగుపడుతుంది. బిడ్డ రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది.
డయాబెటిస్ లేదా హైపర్ టెన్షన్ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..?
తల్లికి డయాబెటిస్ లేదా హైపర్‌టెన్షన్ వంటి వ్యాధి ఉంటే, అది బిడ్డపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా శిశువులో అకాల పుట్టుక, తక్కువ బరువు లేదా శారీరక, మానసిక సమస్యలను కలిగిస్తాయి. కాబట్టి తల్లికి చికిత్స చేయించడం చాలా ముఖ్యం, తద్వారా అది బిడ్డ ఆరోగ్యంపై సానుకూల ప్రభావం కనిపిస్తుంది.
ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
