సాక్షి లైఫ్ : మనిషి తన మనసులోని ఆలోచనల ప్రకారమే కలలు కంటాడని చాలామంది నమ్ముతారు. ఆధ్యాత్మిక చింతనలో ఉన్నవారు గుళ్ళు, గోపురాలు, పూజల వంటి వాటికి సంబంధించిన కలలు కనడం సహజం. అయితే, కలలకు ప్రాణం పోసేది మనస్సే అయినా, వాటి గురించి శాస్త్రీయంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇది కూడా చదవండి.. ప్రాణాలపై పంజా విసురుతున్న పామాయిల్..
ఇది కూడా చదవండి.. గుండె సంబంధిత సమస్యలు ముదరకుండా ఉండాలంటే..?
ఇది కూడా చదవండి.. ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
కలల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని "ఒనిరియాలజీ" అంటారు. నిద్రలో కలలు వచ్చే స్థితిని "రాపిడ్ ఐ మూవ్‌మెంట్" (REM) అంటారు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు కనుగుడ్లు వేగంగా కదులుతూ ఉండటం వల్లనే దీనికా పేరు వచ్చింది. సాధారణంగా డీప్ స్లీప్ దశలోనే మనిషి కలలు కంటాడు.
చాలామంది తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయని భావిస్తుంటారు. అయితే, ఇది కేవలం అపోహ మాత్రమేనని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్రావస్థ చివరి దశ తెల్లవారుజాము కాబట్టి, ఆ సమయంలో వచ్చే కలలను గుర్తుపెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతే తప్ప, వాటికి ప్రత్యేక ప్రాధాన్యత ఏమీ లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
కొంతమంది రాత్రి నిద్ర సమయంలో దాదాపు రెండు గంటల పాటు కలలు కనే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. మరికొందరికి ఒక్కో కల ఐదు నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ఉండవచ్చు. నిద్రలో కలలు రావడం సాధారణమైన విషయం. కలలు ఎక్కువగా వస్తున్నాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సృజనాత్మకత ఎక్కువగా ఉన్నవారికి సహజంగా కలలు ఎక్కువ వస్తాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.
భయానకమైన కలలు వచ్చినప్పుడు గుండె కొట్టుకునే వేగం, శ్వాస తీసుకోవడంలో మార్పులు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఈ కారణంగా మెలకువ కూడా రావచ్చు. సాధారణంగా తెల్లవారుజామున ముందు రోజు చేసిన పనుల తాలూకు ఆలోచనలకు సంబంధించిన కలలు ఎక్కువగా వస్తాయి.
కలలు ఎక్కువగా వేధిస్తున్నప్పుడు పగటిపూట సంతోషకరమైన విషయాలపై దృష్టి పెట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కలలకు అంత ప్రాధాన్యత ఇవ్వకుండా ఇతర విషయాలపై దృష్టి పెట్టడం మంచిది. నిద్రలోని కొన్ని దశల్లో భాగంగా మనస్సులో వచ్చే అసంకల్పిత ఆలోచనలు, భావోద్వేగాల అనుభూతులే కలలు. వాటిని ఆధారంగా చేసుకుని మంచి చెడులను నిర్ధారించలేమని నిపుణులు తేల్చి చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com