Forest Showering : జెన్ జీ న్యూ ట్రెండ్ 'ఫారెస్ట్ షవరింగ్' : ప్రకృతి ఒడిలో సేదతీరితే ఒత్తిడి మాయం..
సాక్షి లైఫ్ : ఉరుకుల పరుగుల జీవనం.. నిరంతరం మోగే మొబైల్ ఫోన్లు.. పని ఒత్తిడితో సతమతమయ్యేవారికి ప్రకృతి ఒక అద్భుతమైన ఔషధంగా మారుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 'ఫారెస్ట్ షవరింగ్' అంటే అడవిలో స్నానం అనే కొత్త ట్రెండ్ కొనసాగుతోంది. దీనికోసం నీళ్లు అవసరం లేదు.. సబ్బులు అక్కర్లేదు.. కేవలం అడవిలోని స్వచ్ఛమైన గాలి, నిశ్శబ్దం ఉంటే చాలు. ప్రస్తుతం ఈ సరికొత్త ట్రెండ్ ను జెన్ జీ తోపాటు ఏడుపదుల వయసు దాటినవారు సైతం ఫాలో అవుతున్నారు. అసలు ఏంటీ..? "ఫారెస్ట్ షవరింగ్" ట్రెండ్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఏమిటీ వింత స్నానం..?
అడవిలోని చెట్ల మధ్య గడపడాన్నే 'ఫారెస్ట్ షవరింగ్'గా పిలుస్తారు. సుమారు మూడు గంటల పాటు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా, స్మార్ట్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి, ప్రకృతి ఒడిలో గడపడమే దీని ప్రధాన ఉద్దేశం. చెట్ల మధ్య నేలపై పడుకుని, ఆకాశం వైపు చూస్తూ, చెట్ల గాలిని పీల్చుకోవడం వల్ల మెదడుకు ఎంతో ప్రశాంతత లభిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
ప్రయోజనాలు ఇవే..
నిరంతర ఆందోళన, ఒత్తిడిని పక్కన పెట్టి ఏకాంతంగా గడపడం వల్ల ఒత్తిడి హార్మోన్లు తగ్గడమేకాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది.
స్వచ్ఛమైన గాలి..
చెట్ల నుంచి వెలువడే 'ఫైటోన్‌సైడ్స్' అనే సేంద్రియ సమ్మేళనాలు మన రోగనిరోధక శక్తిని పెంచడానికి దోహదపడతాయి. అడవిలోని నిశ్శబ్దాన్ని ఆస్వాదించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. అడవిలో గడిపిన ఆ మూడు గంటల ప్రయాణం ముగిశాక, తిరిగి మనం నివసించే యాంత్రిక ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు.. కొత్త ఉత్సాహం, పునరుత్తేజం లభిస్తాయని ఫారెస్ట్ షవరింగ్ ట్రెండ్‌ను అనుసరిస్తున్న వారు చెబుతున్నారు. ఆరోగ్యం కోసం రోజువారీ అలవాట్లలో ప్రకృతికి కొంత సమయం కేటాయించడం ఎంతో అవసరమని మానసిక వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.