Magnet Therapy for Depression : డిప్రెషన్ కు మ్యాగ్నెట్ థెరపీ.. మందులు లేకుండానే ఉపశమనం..
సాక్షి లైఫ్ : తీవ్రమైన మెంటల్ స్ట్రెస్, డిప్రెషన్ తో బాధపడే వారికి ‘ట్రాన్స్‌క్రానియల్ మాగ్నెటిక్ స్టిమ్యులేషన్’ (Transcranial Magnetic Stimulation) ఒక వరంగా మారుతోంది. సాధారణంగా డిప్రెషన్ అనగానే మందులు వాడటం లేదా కౌన్సెలింగ్ తీసుకోవడం అందరికీ తెలిసిందే. అయితే, మందులు వాడినా ఫలితం లేని వారికి, లేదా ఆ మందుల దుష్ప్రభావాల (Side Effects) వల్ల ఇబ్బంది పడే వారికి ఈ 'మ్యాగ్నెట్ థెరపీ' మెరుగైన ఫలితాలను ఇస్తున్నట్లు నిపుణులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఏమిటీ టీఎంఎస్ (Transcranial Magnetic Stimulation)..?
ఇది శస్త్రచికిత్స అవసరం లేని (Non-invasive) ఒక ఆధునిక చికిత్సా విధానం. ఇందులో రోగికి ఒక హెల్మెట్ వంటి పరికరాన్ని అమర్చి, దాని ద్వారా మెదడులోని నిర్దిష్ట భాగాలకు అయస్కాంత తరంగాలను పంపిస్తారు. మెదడులో మూడ్ (Mood)ను నియంత్రించే నాడీ కణాలను ఈ తరంగాలు ఉత్తేజితం చేస్తాయి. తద్వారా దెబ్బతిన్న నాడీ సంబంధాలను మళ్లీ సరిచేయడానికి (Repair/Rewire) వీలవుతుంది. చాలామంది దీనిని పాతకాలపు 'షాక్ ట్రీట్‌మెంట్' (ECT) అని పొరబడతారు. కానీ, దీనికి అనస్థీషియా అవసరం లేదు. రోగి స్పృహలో ఉండగానే ఈ ప్రక్రియ జరుగుతుంది.
మోకాలి సర్జరీ తర్వాత నేను తీవ్రమైన కుంగుబాటుకు లోనయ్యాను. మందులు వాడినా ఏదో మొద్దుబారినట్లు అనిపించేది తప్ప ఉపశమనం ఉండేది కాదు. కానీ, టీఎంఎస్ తీసుకున్న రెండు సెషన్లకే నాలో మార్పు మొదలైంది" అని కింబర్లీ అనే క్రీడాకారిణి తన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ చికిత్స తర్వాత ఆమె కెరీర్, వ్యక్తిగత జీవితంలో మళ్లీ పుంజుకోగలిగారు.
చికిత్సా విధానంఎలా ఉంటుంది అంటే..?
ఈ చికిత్స కోసం వారానికి కొన్ని సార్లు ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది.
సాధారణంగా 30 నుంచి 36 సెషన్లలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది.
దీనికి మొత్తం 6 నుంచి 8 వారాల సమయం పడుతుంది.
ప్రతి ఒక్కరికీ మందులు సరిపడవు. కొంతమందిలో మందుల వల్ల ఫలితం ఉండదు. అటువంటి వారికి టీఎంఎస్ ఒక గొప్ప ప్రత్యామ్నా యం అని సైకియాట్రిక్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. డిప్రెషన్ అనేది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. అందుకే అందరికీ ఒకే రకమైన చికిత్స కాకుండా.. కౌన్సెలింగ్, మందులు లేదా టీఎంఎస్ వంటి ఆధునిక పద్ధతుల్లో ఏది అవసరమో వైద్యులను సంప్రదించి నిర్ణయించుకోవడం ఉత్తమమని మానసిక వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
